చిన్న వయసులో రజస్వలకు కారణాలేమిటి? ఎదురయ్యే ఇబ్బందులేమిటి?

Update: 2020-12-13 03:33 GMT
ఇటీవల ఆడపిల్లల్లో ఎక్కువగా కనిపిస్తున్న సమస్య చిన్న వయసులోనే రజస్వల కావడం. మూడు, నాలుగో తరగతి చదువుతున్న చిన్నారులకు రజస్వల అవుతోంది. వారికి కనీసం ఊహతెలియని వయసులో శరీరంలో మార్పులు వస్తుండంతో చిన్నపిల్లలు కంగారు పడుతున్నారు. తల్లిదండ్రులు కూడా ఆందోళన చెందుతున్నారు. అసలు ఎందుకిలా జరుగుతోంది.. దీని వల్ల పిల్లలకు భవిష్యత్​లో ఏమన్నా సమస్యలు ఎదురవుతాయా? వైద్యనిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం.. సాధారణంగా బాలికల్లో 10 ఏళ్ల నుంచి శరీరంలో మార్పులు వస్తుంటాయి. ఆ ప్రక్రియ దాదాపు నాలుగేళ్ల పాటు ఉంటుంది. అంటే 13, 14, 15 ఏళ్లలో వారికి రజస్వల కావాలి.

కానీ 10 ఏళ్లలోపు పిల్లలకే రజస్వల అవుతున్నది.  రజస్వలకు ముందే బాలికల శరీరంలో కొన్ని మార్పులు వస్తాయి. అయితే పాతకాలంతో పోలిస్తే ఇప్పుడు రజస్వల అయ్యే వయసు చాలా ఎర్లీగా సాగుతున్నది. దీన్ని వైద్యపరమైన పరిభాషలో ప్రికాషియస్​ ప్యుబర్టీ అంటారు. రజస్వలకు ముందు శరీరంలో హైపోథలమస్, పిట్యూటరీ, అండాశయాలు పరిపక్వ స్థితికి చేరుకుంటాయి. శరీరంలో లైంగికమైన మార్పులు కనిపిస్తాయి. పిల్లలు పొడుగు పెరుగుతారు. చివరి దశలో రజస్వల అవుతారు.

అయితే చాలామందికి ఈ స్థితి తొందరగా వస్తున్నది.  ఏడేళ్ల లోపు పిల్లలకు ఇటువంటి లక్షణాలు కనిపించి రజస్వల అయితే దాన్ని ప్రికాషియస్ ప్యుబర్టీ అంటారు. ఇందుకు కారణాలు ఏమిటో తెలుసుకుందాం.. కణుతులు, తలకు దెబ్బ తగలడం వల్ల, లేదా మెదడు వాపు వ్యాధి (మెదడుకు ఇన్ఫెక్షన్) వల్ల , సాధారణ వయసుకన్నా ముందుగానే రజస్వల అవుతారు. ఎడ్రినల్ గ్రంథిలో కణుతులు, అండాశయాల్లో నీటి తిత్తుల వల్ల కూడా ముందే రజస్వల అవుతారని వైద్యులు అంటున్నారు. థైరాయిడ్ గ్రంథి పనితీరులో మార్పుల ఉన్న రజస్వల ముందే అయ్యే అవకాశం ఉన్నది. అయితే 74 శాతం శాతం కేసుల్లో ఎటువంటి కారణమూ కనిపించకపోవచ్చని కూడా వైద్యులు అంటున్నారు. అయితే ఈ పరిస్థితి( ప్రికాషియస్ ప్యుబర్టీ ) వస్తే కచ్చితంగా వైద్యం చేయించాలి. ఎండోక్రైనాలజిస్ట్ సమక్షంలో పరీక్షలు నిర్వహించి వైద్యం మొదలుపెట్టాలి.
Tags:    

Similar News