కవితకు షాకిచ్చిన ఓటర్లు

Update: 2020-12-04 17:30 GMT
తాజాగా జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో కల్వకుంట్ల కవితకు ఓటర్లు పెద్ద షాకే ఇచ్చారు. గ్రేటర్ ఎన్నికల్లో కేసీయార్ గాందీనగర్ డివిజన్లో పోటీ చేస్తున్న అభ్యర్ధుల గెలుపు బాధ్యత ఇచ్చారు. గాంధీనగర్ డివిజన్ నుండి పార్టీ తరపున ముఠా పద్మా నరేష్ పోటీ చేశారు. పద్మ గెలుపు కోసం కవిత బాగానే కష్టపడ్డారు. అయితే బీజేపీ అభ్యర్ధి పావని చేతిలో పద్మ ఓడిపోయారు. ఫలితాలు వచ్చిన తర్వాత తమ అభ్యర్ధి ఓటమితో కవితకు పెద్ద షాకే తగిలినట్లయ్యింది.

ఎందుకంటే తాను ప్రచారానికి వెళ్ళినపుడు ఓటర్లు తనను బాగానే రివీస్ చేసుకున్న విషయాన్ని కవిత గుర్తు చేసుకుంటున్నారట. ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలే తమను గెలిపిస్తాయని అందరిలాగే కవిత కూడా అనుకున్నారు. తీరా ఫలితాలు చూస్తే తమ అభ్యర్ధి ఓడిపోవటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. కవిత లాగే చాలా మంత్రులు, ఎంఎల్ఏలు ఇన్చార్జులుగా ఉన్న చాలా డివిజన్లలో అభ్యర్ధులు ఓడిపోవటం నిజంగా మింగుడుపడటం లేదు.

మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాసయాదవ్, శ్రీనివాస గౌడ్, ఈటెల రాజేందర్ తో పాటు చాలామంది మంత్రులు తమ డివిజన్లలో అభ్యర్ధులు ఓడిపోయారు. అలాగే ఎంఎల్ఏల నియోజకవర్గాల్లోని డివిజన్లలో కూడా టీఆర్ఎస్ అభ్యర్ధులు ఓడిపోవటమే విచిత్రంగా ఉంది. అంటే టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఏస్ధాయిలో జనాల్లో వ్యతిరేకత ఉందో అర్ధమైపోతోంది.

తొందరలోనే మంత్రివర్గ విస్తరణ లేకపోతే ప్రక్షాళనుంటుందని ప్రచారం జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. కొత్తగా ఏర్పాటు కాబోయే మంత్రివర్గంలో కవితకు సీటు గ్యారెంటీ అని ప్రచారం జరుగుతున్న సమయంలోనే గాందీనగర్ డివిజన్ అభ్యర్ధి ఓడిపోవటం నిజంగా కవితకు షాకనే చెప్పాలి.
Tags:    

Similar News