వ్యవసాయ బిల్లుకి రాజ్యసభలో వ్యతిరేకంగా ఓటు వేయండి..!

Update: 2020-09-19 11:30 GMT
కేంద్రంలో అధికారంలో ఉండే బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లు రైతులకి తీవ్ర అన్యాయం చేసే విధంగా ఉందని, తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. ఈ బిల్లు ద్వారా రైతులను దెబ్బ తీసి, కార్పోరేట్ వ్యాపారులకు లాభం చేకూర్చే విధంగా ఉండే ఈ బిల్లుకి మద్దతు ఇవ్వకండి అంటూ టిఆర్ ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కె.కెశవరావును సీఎం ఆదేశించారు. రాజ్యసభలో వ్యవసాయ బిల్లు ప్రవేశపెడుతున్న సందర్భంలో ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించాలని చెప్పారు. పైకి చెప్పడానికి రైతులు తమ సరుకును ఎక్కడైనా అమ్ముకోవచ్చని బిల్లులో చెప్పారు. కానీ వాస్తవానికి ఇది వ్యాపారులు ఎక్కడికైనా వెళ్లి సరకును కొనుగోళు చేయడానికి ఉపయోగపడే విధానం అని అన్నారు.

కార్పోరేట్ గద్దలు దేశమంతా విస్తరించడానికి, ప్రైవేటు వ్యాపారులకు దారులు బార్ల చేయడానికి ఉపయోగపడే బిల్లు. రైతులు తమ సరుకును దేశంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చని అంటున్నారు. నిజానికి రైతులు తమకున్న కొద్దిపాటు సరుకును ఎన్నో రవాణా ఖర్చులు భరించి లారీల ద్వారా వేరే చోటుకు తీసుకెళ్లి అమ్మడం సాధ్యమేయ్యే పనేనా ? ఇది తేనె పూసిన కత్తిలాంటి చట్టం. దీన్ని ఖచ్చితంగా వ్యతిరేకించి తీరాలి అని సీఎం చెప్పారు.
Tags:    

Similar News