తిరుమలలో కరోనా: అర్చకుడు సహా 10మందికి పాజిటివ్

Update: 2020-07-03 16:00 GMT
కరోనా లాక్ డౌన్ తో నెలల తరబడి మూసి ఉన్న ప్రార్థన ఆలయాలను ప్రభుత్వం తెరవడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో తిరుమలకు భక్తుల రాక మొదలైంది. ఎక్కడెక్కడి నుంచో భక్తులు తిరుమలకు వస్తున్నారు. ఈ క్రమంలోనే కరోనా కూడా కదిలివచ్చింది. మహమ్మారి వ్యాపించకుండా ఎన్ని పకడ్బందీ ఏర్పాట్లు చేసినా కూడా తాజాగా టీటీడీలో 10మందికి వైరస్ సోకింది.

తిరుమలకు వెళ్లే ముందే అలిపిరిలోనే భక్తులందరికీ థర్మల్ స్క్రీనింగ్ ను చేస్తున్నారు. అనారోగ్యంగా ఉన్న వారిని పైకి అనుమతించడం లేదు. ప్రస్తుతం టీటీడీలోనూ సిబ్బందికి కరోనా సోకడం భక్తులను అయోమయానికి గురిచేస్తోంది.

టీటీడీలో కరోనా కలకలం రేపింది. తిరుమల స్వామి వారికి పూజలు చేసే అర్చకుడికి కూడా లక్షణాలు బయటపడడంతో అధికారులు అప్రమత్తమై శానిటైజేషన్ పనులు పూర్తి చేశారు. వైరస్ సోకిన వారిలో ఓ అర్చకుడు, ఐదుగురు సెక్యూరిటీ గార్డులు, నలుగురు సన్నాయి వాయిద్యకారులున్నారు. దశలవారీగా ఉద్యోగులకు కరోనా పరీక్షలు చేస్తుండగా తాజాగా తిరుమలలో 10మందికి సోకింది. వారందరినీ ఆస్పత్రులకు తరలించారు. కుటుంబ సభ్యులకు పరీక్షలు చేయాలని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సూచించారు.
Tags:    

Similar News