కరోనా మరణాల్లో 6వ స్థానానికి భారత్

Update: 2020-07-24 15:31 GMT
కరోనా మరణాల్లో ప్రపంచంలో 6వ స్థానానికి భారత్ చేరుకుంది. గత 24 గంటల్లో 740 మరణాలు దేశంలో నమోదయ్యాయి. భారతదేశంలో మొత్తం మరణాల సంఖ్య 30000 దాటింది. ప్రస్తుతం మొత్తం మరణాల సంఖ్య 30,645 వద్దకు చేరుతున్నాయి. దీంతో భారతదేశం ఫ్రాన్స్‌ను దాటి మరణాలలో ఆరో స్థానాన్ని దక్కించుకుంది.

దేశంలో తాజాగా 24 గంటల వ్యవధిలో అత్యధికంగా 49,310 కేసులు నిన్న నమోదయ్యాయి. ఈ సంఖ్య చాలా ఇప్పటి వరకు కరోనా వ్యాపించినప్పటి నుంచి అత్యధికం కావడం గమనార్హం. ప్రస్తుతం దేశంలో రోజుకు కేసులు 50 వేల మార్కుకు దగ్గరగా ఉంది. భారతదేశం, అమెరికా మరియు బ్రెజిల్ లు దేశాల్లో కేసుల నమోదు దాదాపు దగ్గరగా ఉందని ఇది రుజువు చేస్తుంది. అమెరికా, బ్రెజిల్ దేశాల్లో రోజుకు సగటున 60 వేల కేసులను నమోదు చేస్తున్నాయి.

భారతదేశంలో మొత్తం కేసులు ఇప్పుడు 12,87,945కు చేరుకున్నాయి. వీటిలో 4,40,135 క్రియాశీల కేసులు.. 8,17,209మంది డిశ్చార్జ్ అయ్యారు. జూలై 23 వరకు పరీక్షించిన మొత్తం నమూనాల సంఖ్య 1,54,28,170, ఇది మిలియన్ జనాభాకు 11,000 చొప్పున కేసులు నమోదైనట్టు తెలుస్తోంది..
Tags:    

Similar News