విజయసాయి రెడ్డి సవాల్ కు బాబు రియాక్ట్ అవుతారా?

Update: 2019-09-10 08:21 GMT
సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కమ్ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి తాజాగా చంద్రబాబుకు ఒక సవాల్ విసిరారు. బాబు పవర్లో ఉన్న వేళలో పోలీసుల్ని పచ్చ పార్టీ నేతలుగా మార్చుకున్నారని తప్పు పట్టారు. ఈ కారణంతోనే పచ్చ నేతల అవినీతిని బయటపెట్టేందుకు సీఎం జగన్ మోహన్ రెడ్డి సీబీఐతో దర్యాప్తు చేయిస్తున్నట్లు చెప్పారు.

బాబు పాలనలో వ్యవస్థలన్ని నిర్వీర్యం చేసి.. పోలీసులకు పచ్చ యూనిఫాంలు తొడిగారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన విజయసాయి.. అందుకే జగన్ అప్పట్లో సీబీఐ విచారణను కోరారన్నారు. జగన్ పాలనలో పోలీసులు స్వేచ్ఛగా పని చేస్తున్నారంటూ కితాబులు ఇచ్చిన విజయసాయి రెడ్డి.. బాబుకు ఏమైనా సందేహం ఉంటే.. సీబీఐ విచారణకు ఆదేశించాలన్నారు. బాబు ప్రభుత్వంలో స్పీకర్ గా వ్యవహరించిన కోడల కుటుంబం మీద వస్తున్న ఆరోపణలపై సీబీఐ విచారణకు డిమాండ్ చేయాలన్నారు.

పచ్చ దొంగలకు అమరావతి తప్పించి మరింకేమీ పట్టదన్న విజయసాయి రెడ్డి..బాబు తీరును తిట్టిపోశారు. లక్ష్ల కోట్ల రియల్ ఎస్టేట్ రాబడుల గురించి మాత్రమే టీడీపీ అధినేతకు ధ్యాసంతా ఉందని.. అందుకే నిత్యం ఏదో ఒక అంశాన్ని తెర మీదకు తేవటం ద్వారా రాజకీయం చేస్తుంటారంటూ బాబును ఎద్దేవా చేశారు. ఇంతకీ విజయసాయి కోరినట్లు సీబీఐ విచారణకు బాబు అడిగే ధైర్యం చేస్తారంటారా?
   

Tags:    

Similar News