265మందిని ఈ డాక్టర్ వేధించాడు..

Update: 2018-07-20 11:20 GMT
అమెరికా జిమ్మాస్టిక్ టీమ్ విభాగం మాజీ డాక్టర్ ల్యారీ నాసర్  బండారం బయటపడింది. అతడు రెండు దశాబ్ధాలుగా మహిళా జిమ్మాస్టులపై చేసిన లైంగిక వేధింపులకు తగిన శిక్ష పడింది. ఇతడికి జనవరి 25న ఇంఘామ్ కౌంటీ సర్క్యూట్ జడ్జి రోస్ మేరి అక్విలినా భారీ శిక్ష విధించింది. ఇతడు తన వద్ద శిక్షణ పొందిన యువతులను 20 ఏళ్లకు పైగా లైంగికంగా వేధించి.. వారికి నరకం చూపాడనే అభియోగాలు నమోదయ్యాయి. కోర్టులో బాధితులంతా ఏకమై సాక్ష్యం చెప్పడంతో ఇతడికి 175 ఏళ్ల జైలు శిక్ష పడింది. చైల్డ్ పోర్నోగ్రఫీ కేసులో కూడా మరో 60 ఏళ్ల జైలు శిక్ష పడింది. దీంతో ఇతగాడి బారిన పడ్డ మహిళలంతా తాజాగా బయటకు వచ్చారు.

నాసర్ చేతిలో మోసపోయి.. లైంగిక వేధింపులకు గురైన దాదాపు 265 మంది మహిళలు అతడికి వ్యతిరేకంగా గళమెత్తారు. తాజాగా వీరిలో 141 మంది ఇటీవల లాస్ ఏంజిలిస్ లో జరిగిన ఎస్పీ అవార్డ్ కార్యక్రమానికి హాజరయ్యారు. వీళ్లలో చాలా మంది నాడు అతడికి వ్యతిరేకంగా కోర్టు సాక్ష్యం చెప్పారు.

ఈ మహిళలు  ఆ డాక్టర్ బెదిరింపులకు లొంగకుండా సాక్ష్యం చెప్పినందుకు వారికి ‘espy.arthur ashe’ పేరిట అవార్డు ప్రకటించారు. వీరు అందరూ స్టేజ్ మీదకు వచ్చి ఆ అవార్డును ఒలింపిక్ జిమ్మాస్టర్ అలా రైస్మన్ చేతులమీదుగా అందుకున్నారు. ఈ సందర్భంగా ల్యారీ నాసర్ చేసిన ఆకృత్యాలను వెల్లడించి కన్నీళ్లు పెట్టుకున్నారు. ఎన్ని బాధలు పడైనా సరే దేశానికి పతకం అందించామని ఉద్వేగానికి గురయ్యారు.

వీడియో కోసం క్లిక్ చేయండి


Full View
Tags:    

Similar News