వెంకయ్య కలలపై బాంబు పడినట్టే...

Update: 2017-07-23 17:02 GMT
గృహ నిర్మాణ శాఖ నుంచి ఆయన మారిపోతూ ఉండవచ్చు గాక! రాజకీయ పదవుల నుంచి రాజ్యాంగబద్ధమైన ఉపరాష్ట్రపతి పదవిలోకి మారుతుండవచ్చు గాక..! కానీ, మోడీ సర్కారులో అమాత్యుడిగా ఈ దఫా గద్దె ఎక్కిన తరువాత ఆయన కన్న అతిపెద్ద కల ఇప్పుడు డైలమాలో పడుతోంది. ఆ కలలపై దాదాపుగా బాంబు పడినట్టే కనిపిస్తోంది. మోడీ సర్కారులో వెంకయ్య మంత్రి అయిన తర్వాత.. స్మార్ట్ సిటీ అనేది ఓ అద్భుతమైన - కలగా దాన్ని అమల్లోకి తీసుకువచ్చారు. స్మార్ట్ సిటీ పథకం కింద నగరాలను గుర్తించడం అంటే.. అక్కడికేదో రాష్ట్రాలకు కేంద్రం నుంచి గొప్ప వరం ఇచ్చేస్తున్నట్లుగా బిల్డప్ ఇవ్వడం జరుగుతూ వస్తోంది. అయితే ఇప్పుడు స్మార్ట్ సిటీ అనే పథకానికి విదేశీ గ్రహణం పడుతున్నట్లుగా కనిపిస్తోంది.

భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఈ స్మార్ట్ సిటీ పథకం వల్ల పర్యావరణానికి చాలా పెద్ద నష్టం వాటిల్లుతుందంటూ.. ఇప్పుడు కొత్త వాదనలు వినిపిస్తున్నాయి. ఈ స్మార్ట్ సిటీ పథకానికి సంబంధించి కేంద్రం విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం పర్యావరణానికి నష్టం జరుగుతుందంటూ బ్రిటన్ లోని ఒక యూనివర్సిటీ ఒక వాదన లేవనెత్తుతోంది.

బ్రిటన్ లోని యూనివర్సిటీ ఆఫ్ లింకోల్స్ వారు ఒక అధ్యయనం నిర్వహించారు. స్మార్ట్ సిటీ పథకంలో భాగంగా.. 40 అంతస్తుల భవనాలు నిర్మిస్తాం అంటూ కేంద్రం అప్పట్లో ప్రకటించింది. కానీ ఇవన్నీ పర్యావరణ హానికారకం అంటూ బ్రిటన్ యూనివర్సిటీ అధ్యయనం తేల్చడం విశేషం. మరి దేశంలో ఏం పనులు చేపట్టదలచుకున్నా పర్యావరణ నిబంధనల పేరిట సవాలక్ష ఆంక్షలు విధించే సర్కారు... ఈ స్మార్ట్ సిటీల విషయంలో వచ్చిన అధ్యయనం నివేదిక చూశాక, తమ మార్గ దర్శకాలను ఏమైనా మార్చుకుంటుందేమో చూడాలి.
Tags:    

Similar News