టీడీపీకి అపాయింట్ మెంట్ ఇచ్చింది వెంక‌య్య మాత్ర‌మేన‌ట‌!

Update: 2020-02-19 01:30 GMT
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీల ఢిల్లీ యాత్ర అనూహ్యంగా వాయిదా ప‌డిన సంగ‌తి తెలిసిందే. శాస‌న‌మండ‌లి ర‌ద్దు వ్య‌వ‌హారాన్ని ఢిల్లీకి తీసుకు వెళ్లి ర‌చ్చ చేయాల‌ని ముందుగా తెలుగుదేశం పార్టీ వాళ్లు భావించారు. అయితే ఆ కార్య‌క్ర‌మానికి ఢిల్లీ నుంచి సానుకూల స్పంద‌న రాలేద‌ని స‌మాచారం. ఢిల్లీకి వెళ్లి జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద ర‌చ్చ చేసినా పెద్ద‌గా యూజ్ ఉండ‌దు. అందుకే మోడీ, అమిత్ షా వంటి వారి అపాయింట్ మెంట్స్ కోరార‌ట తెలుగుదేశం ఎమ్మెల్సీలు. అవి ల‌భించ‌క‌పోవ‌డంతో వారి ఢిల్లీ ప్ర‌యాణం ర‌ద్దు లేదా తాత్కాలికంగా వాయిదా ప‌డ‌టం జ‌రిగింద‌ట‌.

అయితే ఢిల్లీలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీల‌కు ఒకరి అపాయింట్ మెంట్ మాత్రం ల‌భించింద‌ట‌. అది ఉప రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య నాయుడి అపాయింట్ మెంట్. మండ‌లి ర‌ద్దు గురించి జ‌గ‌న్ పై కంప్లైంట్ ఇవ్వ‌డానికి వ‌స్తామ‌న్న టీడీపీ ఎమ్మెల్సీల‌కు ఆయ‌న అపాయింట్ మెంట్ ఇచ్చార‌ట‌. అయితే ఢిల్లీ వ‌ర‌కూ వెళ్లి వెంక‌య్య నాయుడిని మాత్ర‌మే క‌లిసి వ‌స్తే తెలుగుదేశం పార్టీకి భంగపాటు ఎదురైన‌ట్టే!

వెంక‌య్య నాయుడు ఎలాగూ త‌ర‌చూ ఏపీకి వ‌స్తూ ఉంటారాయె. ఆయ‌నకు ఫిర్యాదు చేయాలంటే ఎంచ‌క్కా ఇక్క‌డ‌కు వ‌చ్చిన‌ప్పుడు కంప్లైంట్ ఇవ్వ‌వ‌చ్చు. వెంక‌య్య కోస‌మే అయితే ఢిల్లీ వ‌ర‌కూ వెళ్ల‌డం ఫ్లైట్ చార్జీలు దండ‌గా. ఈ విష‌యాన్ని టీడీపీ ఎమ్మెల్సీలు కూడా గ్ర‌హించిన‌ట్టుగా ఉన్నారు. అయితే వెంక‌య్య‌కు కంప్లైంట్ ఇచ్చినా ఉప‌యోగం ఉంటుందా అనేది మ‌రో ప్ర‌శ్న‌!

అమ‌రావ‌తి గురించి కూడా తెలుగుదేశం వ‌ర్గాలు వెంక‌య్య‌కు కంప్లైంట్ ఇచ్చారు. ఆయ‌న స్పందించ‌డ‌మూ జ‌రిగింది. *ఎవ‌రికి చెప్పాలో వారికి చెప్తా..*అంటూ ఆయ‌న ప్ర‌క‌ట‌న కూడా చేశారు అప్ప‌ట్లో. ఆ త‌ర్వాత ఆయ‌న ఎవ‌రికి ఏం చెప్పారో కానీ, మూడు రాజ‌ధానుల ప్ర‌క‌ట‌న గురించి కేంద్రం నుంచి గ‌ట్టి వ్య‌తిరేక‌త అయితే క‌నిపించ‌క‌పోవ‌డం కూడా గ‌మ‌నార్హ‌మే!

Tags:    

Similar News