మూడు రాజధానులు మాకు ఇష్టం లేదు: వైసీపీ ఎమ్మెల్యే
సీఎం జగన్ ఆంధ్రప్రదేశ్ లోని మూడు ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చారు. బిల్ పాస్ చేయించారు. అయితే ఇప్పటికీ ఈ ప్రతిపాదనపై ప్రతిపక్షాల్లోనే కాదు.. సొంత వైసీపీలోనూ భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా హైదరాబాద్ లో వ్యాపారాల కోసమే మూడు రాజధానులకు తాము సహకరిస్తున్నామంటూ మాజీ మంత్రి, టీడీపీ నేత ఉమా మహేశ్వరరావు వ్యాఖ్యానించారు.
దీనికి కౌంటర్ గా తాజాగా మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే వసంత నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లో వ్యాపారాల కోసమే మూడు రాజధానులకు తాము సహకరిస్తున్నామనడాన్ని ఖండించారు. ఈ వ్యాఖ్యలు అర్థరహితమన్నారు. విజయవాడలో విలేకరుతో మాట్లాడిన వసంత ఈ సందర్భం గా క్లారిటీ ఇచ్చారు.
తాను తన కుమారుడు వసంత కృష్ణ ప్రసాద్ రాజకీయాల్లో నీతి, నిజాయితీలతో పనిచేస్తున్నామని వసంత నాగేశ్వరరావు తెలిపారు. సీఎం జగన్ మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చినప్పుడు తాము సీఎం జగన్ వద్దకు వెళ్లి ఈ ప్రతిపాదన తనకు ఇష్టం లేదని.. తమ ప్రాంత ప్రజలు వ్యతిరేకిస్తున్నారని నిర్భయంగా చెప్పామని సంచలన నిజాలు బయటపెట్టారు. దీనికి వ్యతిరేకంగా వైసీపీ ఎమ్మెల్యే పాదయాత్రకు సహకరించామన్నారు.
మాజీమంత్రి ఉమామహేశ్వరరావు తమ కుటుంబం బురదజల్లుతున్నారని.. తాను ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటున్నానని.. మూడు రాజధానులపై తాను స్పందించలేనని వసంత నాగేశ్వరరావు తెలిపారు.