అసెంబ్లీలో అయోమయానికి గురైన వల్లభనేని వంశీ!

Update: 2019-12-09 08:54 GMT
ఆంధ్రప్రదేశ్ శీతాకాల అసెంబ్లీ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలలో టీడీపీ - వైసీపీ మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. ఇకపోతే ఈ సమావేశాల్లో అందరి దృష్ఠి  గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పైనే పడింది. అయన ఇప్పటికే టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. చంద్రబాబు వాట్సాప్ ద్వారా రాజీనామా లేఖను పంపారు. అలాగే చంద్రబాబుతో లోకేష్‌ పై విమర్శలు చేశారు. జగన్ వెంట నడవాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఇటు టీడీపీ కూడా వంశీని పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు ప్రకటించింది.

అయితే ఆయన్ను సస్పెండ్ చేసినట్లు అధికారికంగా స్పీకర్ కార్యాలయానికి సమాచారం ఇవ్వలేదు. దీనితో అసెంబ్లీ ఆయన  సీటు ఎటువైపు అని అందరూ ఆతృతగా ఎదురుచూసారు. ఇక ఈ నేపథ్యంలో అసెంబ్లీ కి వచ్చిన ఎమ్మెల్యే వంశీ ..టీడీపీ వరుసలోనే కూర్చున్నారు. అసెంబ్లీ రికార్డుల ప్రకారం వంశీ టీడీపీ సభ్యుడిగానే ఉండటంతో.. వంశీ టీడీపీ బెంచ్‌లలో వెనుక వైపు కూర్చున్నారు. మరోవైపు వల్లభనేని వంశీని టీడీఎల్పీ కార్యాలయంలోకి రావాలని తోటి ఎమ్మెల్యేలు కోరారు. కానీ,  వంశీ వారి ఆహ్వానాన్ని సున్నితంగా తిరస్కరించారు. తర్వాత చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి కూడా తమ కార్యాలంయలోకి రావాలని కోరగా ఆయన స్పందించలేదు. దీంతో వల్లభనేని వంశీ కాస్త అయోమయంలో పడ్డారనే చెప్పాలి.
 
Tags:    

Similar News