యుద్ధం వస్తే విధుల్లోకి అంటున్న టీ కాంగ్రెస్ చీఫ్‌!

Update: 2016-09-30 09:10 GMT
తాజాగా భారత సైన్యం చేపట్టిన సర్జికల్ స్ట్రైక్స్ సరిహద్దు వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్‌ కుమార్ రెడ్డి అభినందనకు అర్హమైన ప్రకటన ఒకటి చేశారు. తన అంచనా ప్రకారం యుద్ధం దేనికి పరిష్కారం కాదని, భారత్‌ కు ప్రస్తుతం కష్టకాలమని అభిప్రాయపడిన ఉత్తం కుమార్...  యుద్ధం వస్తే - అవసరమంటే ఏ క్షణమైనా విధుల్లో జాయిన్ అయ్యేందుకు తాను సిద్ధమని ప్రకటించారు. అవసరమైనప్పుడు దేశానికి సేవ చేయడం కంటే మహాభాగ్యం మరోటి ఉండదని ఆయన పేర్కొన్నారు.

ఇదే సమయంలో మరింత ఉత్సాహంగా మాట్లాడిన ఉత్తం కుమార్... రాజకీయాల్లో ఉన్నంత మాత్రాన తాను అన్ని మర్చిపోయాననుకోవడం పొరపాటని, సమయం వస్తే కదనరంగంలో దూకడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఆయన తెలిపారు. ఈ ప్రకటనపై ఉత్తమ్ కు ప్రశంసలు వెళ్లువెత్తుతున్నాయి. కాగా... ప్రస్తుతం రాజకీయాల్లో ఉంటూ తెలంగాణ పీసీసీ చీఫ్ గా ఉన్న ఆయన 20 ఏళ్లు భారత వాయుసేనలో మిగ్ ఎయిర్ క్రాఫ్ట్ పైలట్‌ గా సేవలందించారు.

ఈ విషయాలపై మాట్లాడిన ఉత్తమ్... తాజా పరిణామాలు, సరిహద్దుల్లో పరిస్థితులు చూస్తుంటే భారత్, పాకిస్థాన్ మధ్య యుద్ధం తప్పదనిపిస్తోందని అన్నారు. తాజాగా జరిగిన సర్జికల్ స్ట్రైక్స్ పై స్పందిస్తూ... ఇలాంటి ఆపరేషన్లలో నాణ్యమైన పరికరాలతో, అద్భుతమైన ప్రణాళికతో, నైట్ విజన్ గాగుల్స్, జీపీఎస్ పరికరాలు, నాణ్యమైన ఆయుధ సామాగ్రితో కార్యక్రమాలు చేపడతారన్నారు. ఉపగ్రహాల సహాయంతో పాటు నిఘా వర్గాల సాయంతో తీవ్రవాదుల కదలికలు గుర్తించి వారి అంతు చూస్తారని తెలిపారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News