శానిటైజర్ దెబ్బకు ఆగిన ఓట్ల లెక్కింపు.. ఎందుకు?

Update: 2020-11-05 07:51 GMT
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. కరోనా నేపథ్యంలో శానిటైజర్లను విపరీతంగా వాడేస్తున్న సంగతి తెలిసిందే. సెకండ్ వేవ్ భయాలు అమెరికా.. యూరప్ తదితర దేశాల్లో మహా జోరుగా సాగుతున్న వేళ.. అధ్యక్ష ఎన్నికల ఓట్ల లెక్కింపు కార్యక్రమం జరుగుతుండటం తెలిసిందే. దీంతో.. ఓట్లను లెక్కించే సిబ్బంది ముందస్తు జాగ్రత్తలు పెద్ద ఎత్తున తీసుకుంటున్నారు. అందులో భాగంగా చేతులకు అదే పనిగా శానిటైజర్లను వాడుతున్నారు.

శానిటైజర్ కారణంగా ఓట్ల లెక్కింపు కార్యక్రమం ఆగిపోయిన విచిత్రమైన ఘటన చోటు చేసుకుంది. దాదాపు గంట పాటు ఓట్ల లెక్కింపు నిలిచిపోయింది. అయోవా రాష్ట్రంలోని డెస్ మోయిన్స్ నగరంలో ఓట్ల లెక్కింపు చేస్తున్నారు. శానిటైజర్లను వాడటం వల్ల.. దాని తేమ స్కానింగ్ మెషిన్లోకి ప్రవేశించటంతో.. అది కాస్తా పని చేయటం మానేసింది. దీంతో.. ఓట్లు స్కాన్ కాని పరిస్థితి.

ఈ లోపాన్ని గుర్తించి.. సరి చేసేందుకు దాదాపు గంటకు పైగా సమయం పట్టింది. మరోసారి ఇలాంటి ఇబ్బంది తలెత్తకుండా చేసేందుకు శానిటైజర్ డబ్బాను బ్కాలెట్ స్కానర్ కు దూరంగా ఉంచేశారు. శానిటైజర్ ను రాసుకొని స్కానర్ వద్దకువెళ్లే లోపు చేతులు పొడిగా అయ్యేలా.. తేమ లేకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. మొత్తానికి ఓట్ల లెక్కింపును కాసేపు ఆపేసిన ఘనత శానిటైజర్ సొంతం చేసుకుందని చెప్పకతప్పదు.
Tags:    

Similar News