అమెరికాలో ఎన్నికల కోలాహాలం.. ఢిల్లీలో ప్రత్యక్షం కాబోతున్న ట్రంప్ క్యాబినెట్ మంత్రులు!!

Update: 2020-10-26 09:10 GMT
అమెరికా గత కొన్నిరోజులుగా కరోనా మహమ్మారి దెబ్బకి వణికిపోయింది. ప్రస్తుతం ఎన్నికల ప్రచారాలతో హోరెత్తిపోతుంది. అమెరికాలో నవంబర్ 3 న అధ్యక్ష ఎన్నికలకి ఓటింగ్ జరగబోతుంది. దీనితో అన్ని పార్టీలు కూడా ఈ చివరి క్షణాలని సద్వినియోగం చేసుకోవాలని , ప్రచారంలో జోరుపెంచాయి. ఒకవైపు ట్రంప్ మరోసారి అధ్యక్ష పీఠం నాదే అని గొప్పలు చెప్తుంటే , అమెరికా పై ట్రంప్ కి ప్రేమ లేదు , మేము వస్తే అందరికి న్యాయం చేస్తాం అంటూ జో బిడెన్ ప్రచారంలో ఉదరగోడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కేబినెట్‌ లోని ఇద్దరు మంత్రులు భారత పర్యటన కు  రానున్నారు. ఈ సాయంత్రానికి వారు దేశ రాజధానికి చేరుకోనున్నారు.

అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మైక్ పాంపియో, రక్షణ మంత్రి మార్క్ టీ ఎస్పర్  భారత పర్యటనకు రాబోతున్నారు.  మంగళవారం దేశ రాజధానిలో వారిద్దరూ రక్షణశాఖ మంత్రులు సుబ్రహ్మణ్యం జైశంకర్, రాజ్‌నాథ్ సింగ్‌లతో సమావేశం కానున్నారు. 2 + 2 విధానంలో వారి మధ్య ద్వైపాక్షిక చర్చలు ప్రారంభం కానున్నాయి. భారత పర్యటన ను ముగించుకున్న తర్వాత  వారు శ్రీలంక, మాల్దీవులు, ఇండొనేషియా పర్యటనకువెళ్లనున్నారు. భారత్ , చైనా మధ్య రోజురోజుకి వివాదం ముదురుతోంది. ఒక దశలో సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం కనిపించింది. చైనా అంటే అమెరికాకూ పడదు. అందుకే భారత్‌ సహా దక్షిణాసియా దేశాలతో సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తూ చైనా చుట్టూ చక్రబంధాన్ని ఏర్పరచాలనే లక్ష్యంతో అమెరికా పనిచేస్తున్నట్లు కనిపిస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.

భారత్-అమెరికా విదేశాంగ, రక్షణశాఖ మంత్రుల మధ్య జరిగే ఈ ద్వైపాక్షిక చర్చల్లో ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలు చర్చకు వస్తాయని ఇదివరకే కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆయా శాఖల మంత్రుల మధ్య వేర్వేరు సందర్భాల్లో..విభిన్న వేదికలపై ద్వైపాక్షిక చర్చలు ఏర్పాటు కావడం ఇది మూడోసారి. ఈ సారి న్యూఢిల్లీ వేదికగా జరిగే ఈ చర్చల్లో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ కూడా పాల్గొననున్నారు. ఓ వైపు అమెరికాలో ఎన్నికల వేడి మంచి కాకమీద ఉన్న సమయంలో  మైక్ పాంపియో, మార్క్ టీ ఎస్పర్.. భారత్ సహా శ్రీలంక, మాల్దీవులు, ఇండొనేషియా పర్యటనలకు బయలుదేరి రాబోతోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది.ఈ పర్యటన ద్వారా భారత్‌ ముప్పుగా పరిణమించిన చైనాను టార్గెట్‌గా చేసుకోవడం ద్వారా తమ దేశంలో స్థిరపడిన ప్రవాస భారతీయుల ఓటుబ్యాంకును ప్రభావితం చేయడానికి అవకాశం ఉందనే వాదనలు  కూడా వినిపిస్తున్నాయి. అయితే , ముందుగా నిర్ణయించిన ప్రకారమే వారు పర్యటనకి రాబోతున్నారని అనురాగ్ శ్రీవాస్తవ తెలిపారు.
Tags:    

Similar News