ఎయిరిండియా కొనుగోలు రేసులో అమెరికా ఆ దిగ్గజ సంస్థ!

Update: 2020-09-28 12:30 GMT
ఎయిరిండియా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం గత కొంత కాలంగా ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఎయిరిండియాను కొనుగోలు చేసేందుకు ఏ సంస్థ ముందుకు రాకపోవడంతో ఈ ప్రక్రియ జాప్యం అవుతోంది. కోవిడ్ సంక్షోభం నేపథ్యంలో సింగపూర్ ఎయిర్‌లైన్స్ వంటి సంస్థలు ఎయిరిండియా కొనుగోలుకు తమకు ఆసక్తి లేదంటూ వెనక్కి తగ్గాయి. ఈ నేపథ్యంలో ఎయిరిండియా కొనుగోలుకు  ఫండ్‌ ఇంటరప్స్‌ ఇన్‌ కార్పొరేటెడ్‌ ఆసక్తి చూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

అమెరికాకు చెందిన ఫండ్‌ ఇంటరప్స్‌ ఇన్‌ కార్పొరేటెడ్‌ ఆసక్తి చూపుతోంది. ఎయిరిండియా విలువను ఇప్పటికే అది లెక్కకట్టిందని.. ఇన్వ్‌ ఇట్‌ మార్గంలో సంయుక్తంగా బిడ్‌ ను దాఖలు చేసేందుకు భారత బ్యాంకులు, పెట్టుబడుదార్లతో చర్చలు కూడా మొదలుపెట్టిందని ఒక తెలుస్తుంది . కాగా, ఈ బిడ్‌ కు ముందు వరుసలో ఉన్న టాటాలు.. మిస్త్రీ వాటాను కొనుగోలు చేసే క్రమంలో ఉండడంతో తాజా పరిణామం కేంద్ర ప్రభుత్వానికి ఊరటనిచ్చేదేనని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఆసక్తి వ్యక్తీకరణకు చివరితేదీ అక్టోబర్‌ 30 అన్న సంగతి తెలిసిందే
Tags:    

Similar News