సీఏఏ నిరసనకారులపై యూపీ సీఎం సంచలన వ్యాఖ్యలు !
పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)ను వ్యతిరేకిస్తూ గతేడాది డిసెంబర్ 20,21 తేదీల్లో యూపీ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు జరిగిన విషయం తెలిసిందే. దేశంలో మరే రాష్ట్రంలోనూ లేని విధంగా యూపీలో భయంకరమైన హింస జరిగింది, అలాగే పలు చోట్ల పోలీసులే విధ్వంసానికి పాల్పడటం, కాల్పుల్లో 22 మంది ఆందోళనకారులు చనిపోవడం తెలిసిందే. దీనిపై యూపీ అసెంబ్లీలో పెద్ద రచ్చే జరిగింది. పోలీసులు, బీజేపీ నేతల కాల్పుల్లోనే నిరసన కారులు చనిపోయారనే ఆరోపణల నేపథ్యం లో సీఏఏ హింస పై జ్యూడీషియల్ ఎంక్వైరీకి ఆదేశించాలని ప్రతిపక్ష సమాజ్ వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ ఎమ్మెల్యేలు పట్టుపట్టడంతో సీఎం యోగి వారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
చ్చితంగా విధ్వంసం సృష్టించాలనో, ఎదుటివాడిని చంపేయాలనే ఉద్దేశంతోనే ఒకడు రోడ్డు మీదికొస్తే.. మారణాయుధాలను చూపిస్తూ పోలీసులకే ధమ్కీ ఇస్తే.. అలాంటివాడు బతికే చాన్సే లేదు. అయితేగియితే ఆందోళనకారులైనా చావాలి.. లేదంటే పోలీసులైనా అమరులైపోవాలి... ప్రాణాలు పోవడం మాత్రం పక్కా. సీఏఏ నిరసనకారుల చావులతో పోలీసులకు సంబంధంలేదు. దీనిపై జ్యూడీషియల్ ఎంక్వైరీ అవసరమే లేదు. నిజానికి సీఏఏకు వ్యతిరేకం గా ఊహించనంత పెద్ద కుట్రలు జరిగాయి. ముందు అవేంటో బయట పడాలి'' అని సీఎం యోగి అసెంబ్లీ లో అన్నారు
సీఏఏ వ్యతిరేక నిరసనల్లో యూపీ వ్యాప్తంగా 22 మంది చనిపోయారు. వాళ్లంతా బుల్లెట్లు తగలడం వల్లే ప్రాణాలు విడిచారు. కాల్పులతో తమకే సంబంధం లేదని బుకాయించిన పోలీసులు.. బిజ్నూర్ ఘటన పై మాత్రం నేరాన్ని అంగీకరించారు. సివిల్స్ పరీక్షలకు సిద్ధమవుతోన్నట్లుగా వెల్లడైన సులేమాని.. పోలీసులపై కాల్పులు జరపడంతో ఆత్మరక్షణ కోసమే అతణ్ని కాల్చి చంపామని బిజ్నూర్ ఎస్పీ సంజీవ్ త్యాగీ అధికారిక ప్రకటన చేశారు. ఈ కేసు పై ప్రస్తుతం కోర్టు లో విచారణ సాగుతోంది.
సీఏఏ వ్యతిరేక నిరసనల్లో హింసకు సంబంధించి యూపీ సర్కారు సోమవారం అలహాబాద్ హైకోర్టుకు ఒక రిపోర్టు సమర్పించింది. డిసెంబర్ 20, 21 తేదీల్లో జరిగిన ఘటనల్లో మొత్తం 22 మంది చనిపోయారని, 83 మంది నిరసనకారులు, 455 మంది పోలీసులు గాయపడ్డారని, చనిపోయినవాళ్లలో కేవలం ఇద్దరు మాత్రమే పోలీసుల తూటాలకు బలైపోయి ఉంటారని, మిగిలిన 20 మంది చావులకు కారణాలు తెలియలేదని యోగి ప్రభుత్వం తెలిపింది. అయితే ,దీనిపై సీఎం మాట్లాడుతూ .. ఉత్తరప్రదేశ్ లో సీఏఏ వ్యతిరేక నిరసనల సందర్భంగా జరిగిన ఆందోళనల్లో 22 మంది చనిపోయినమాట వాస్తవం. అయితే ఇందులో పోలీసుల ప్రమేయం అసలు లేదు. నిరసనకారులు తమలోతామే తుపాకులతో కాల్చుకుని చనిపోయారు. అయినా, చావడానికే సిద్ధపడి రోడ్లపైకి వచ్చినవాళ్లు ప్రాణాలతో ఎలా మిగులుతారు?'' అంటూ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు అయితే ,ప్రభత్వం కోర్టుకు రిపోర్టు ఇచ్చిన రెండో రోజే సీఎం యోగి ఆదిత్యనాథ్ అసెంబ్లీ లో విరుద్ధ ప్రకటన చేయడం ప్రస్తుతం వివాదాస్పదమైంది.