హత్యాచారాలపై యూపీ సీఎం సంచలన నిర్ణయం

Update: 2019-12-09 10:15 GMT
దేశంలో ఇటీవల కాలంలో అత్యాచారాలు, హత్యలు పెరిగిపోతున్నాయి. మహిళలకు భద్రత అనేది ఎండమావి అవుతోంది. తెలంగాణలో దిశ, ఉత్తరప్రదేశ్ ఉన్నావ్ లో మహిళ సజీవ దహనం దేశవ్యాప్తంగా కలకలం రేపాయి..

ఉత్తరప్రదేశ్ లో అత్యాచారాలు, హత్యల పరంపర కొనసాగుతోంది. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన యూపీలో వీటిని అరికట్టడానికి తాజాగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ కేసులను వేగంగా విచారించేందుకు ఉత్తరప్రదేశ్ వ్యాప్తంగా 218 ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేశారు. అత్యాచారాల కేసులకు 144 ఫాస్ట్ ట్రాక్ కోర్టులు, పిల్లలపై నేరాలకు 74 కోర్టులను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

ఉన్నావ్ అత్యాచార బాధితురాలిని కాల్చిచంపిన వైనంపై యూపీ సీఎం యోగిపై దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు చెలరేగాయి. ఈ విషయంలో బీజేపీ ప్రభుత్వం అసమర్థతపై అందరూ దుమ్మెత్తిపోశారు. ఈ నేపథ్యంలో ఇలాంటి దారుణాలపై కఠిన శిక్షలు పడేలా యోగి ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటుకు ఆమోద ముద్ర వేసింది.
Tags:    

Similar News