పురుష క్రికెటర్ల తో మేం సమానమే కాదు
ప్రపంచంలోనే ఆదాయంలో, ఆర్జనలో నంబర్ 1 క్రికెట్ బోర్డు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ). అయితే ఈ ఆదాయం అంతా పురుషుల క్రికెట్ నుంచే వస్తోంది. అందుకే ప్రతీ ఏటా వారి కాంట్రాక్టులు పెంచుతూ కోట్ల రూపాయలను క్రికెటర్లకు బోర్డు చెల్లిస్తుంటుంది. అయితే మహిళా క్రికెట్ ను బీసీసీఐ పట్టించుకోవడం లేదని.. పురుషుల తో సమానంగా మహిళా క్రికెటర్ల కు జీతాలు ఇవ్వడం లేదన్న విమర్శలున్నాయి.
తాజాగా ఈ వివాదంపై భారత స్టార్ మహిళా క్రికెటర్ స్మృతీ మందానా స్పందించారు. ఐసీసీ ప్రకటించిన ‘వుమెన్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్’ కార్యక్రమంలో పాల్గొన్న స్మృతీ విలేకరులతో మాట్లాడారు. పురుషులతో పోల్చుకుంటే తక్కువ ఫీజులు, పారితోషకాలు పొందడంపై తమకు ఎలాంటి బాధ లేదని మందానా స్పష్టం చేశారు.
మహిళా క్రికెటర్ల కు వచ్చే జీతాలు పురుషుల క్రికెట్ నుంచి వచ్చే ఆదాయం తోనే వస్తున్నాయనే విషయం మనం గుర్తించాలి. మహిళల క్రికెట్ ద్వారా ఆదాయం వచ్చిన రోజు నేనే ముందుండి సమాన జీతాల కోసం పోరాడుతా.. పురుషుల కంటే తక్కువ ఫీజులు, పారితోషకాలపై తమకు ఎలాంటి బాధ లేదని ’ స్మృతి మందానా క్లారిటీ ఇచ్చారు.