కేసీఆర్ బంధువుల కిడ్నాప్ కేసులో అనూహ్య ట్విస్ట్
సీఎం కేసీఆర్ బంధువులను కిడ్నాప్ చేసిన కేసులో అనూహ్య మైన ట్విస్ట్ వచ్చింది. అందరూ భావించినట్టుగా ఈ కేసులో మాజీ మంత్రి, టీడీపీ నాయకురాలు కీలక పాత్రధారి కాదని పోలీసుల స్టేట్ మెంట్ లో వెల్లడైంది. హైదరాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ ఈ మేరకు వివరాలు వెల్లడించారు.
హఫీజ్ పేటలో 100 కోట్ల భూవివాదం నేపథ్యంలో చేసిన కిడ్నాప్ కేసులో ఏపీ మాజీ మంత్రి అఖిలప్రియను అరెస్ట్ చేశామని సీపీ అంజనీకుమార్ తెలిపారు. ఈ మొత్తం వ్యవహారంలో అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ్ రామ్ సహా మరికొందరికి సంబంధముందని వెల్లడించారు.
ఎఫ్ఐఆర్ ప్రకారం ఈ కేసులో కీలక సూత్రధారి ఏ1గా ఏవీ సుబ్బారెడ్డిని చేర్చినట్టు సీపీ అంజనీకుమార్ తెలిపారు. భూమా అఖిలప్రియను ఏ2గా, భార్గవ్ రామ్ ను ఏ3గా చేర్చినట్టు తెలిపారు. వీరికి సంబంధించిన స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని తెలిపారు.
బోయినపల్లి కృష్ణ రెసిడెన్సీలో ఐటీ అధికారుల్లా ఫేక్ సెర్చ్ వారెంట్ తో వీరు ప్రవీణ్ రావు ఇంట్లో ప్రవేశించి ఆయనతోపాటు ఇద్దరు సోదరులు నవీన్, సునీల్ లను కిడ్నాప్ చేశారని అంజనీకుమార్ తెలిపారు.
వారి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు 15 బృందాలు గాలింపు చేపట్టాయని సీపీ తెలిపారు. చివరకు నార్సింగ్-కోకపేట ప్రాంతంలో ముగ్గురు నిందితులను విడిచిపెట్టి పారిపోయారని తెలిపారు. మిగతా నిందితులు పరారీలో ఉన్నారని.. వాళ్లను త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు.