పోలవరం ప్రాజెక్టుకు కేంద్రమే చేపట్టాలి: ఉండవల్లి
రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మరోసారి మీడియాకు ముందుకు వచ్చారు. ఈసారి పోలవరం ప్రాజెక్ట్ పై మాట్లాడారు. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం పోలవరం ప్రాజెక్ట్ ను కేంద్ర ప్రభుత్వమే చేపట్టాలని ఉండవల్లి అరుణ్ కుమార్ స్పష్టం చేశారు. ఇదే విషయమై కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరాలని ఆయన డిమాండ్ చేశారు.
పోలవరం ప్రాజెక్ట్ ఇంకా నిర్మాణం పూర్తి కాలేదని.. ఈ ప్రాజెక్ట్ బాధ్యత కేంద్రానిదేనని ఉండవల్లి కుండబద్దలు కొట్టారు. నాడు పార్లమెంట్ సాక్షిగా యూపీఏ ప్రభుత్వం హామీ ఇచ్చిందని విభజన చట్టంలోనూ పూర్తి చేస్తామని తెలిపిందని ఉండవల్లి చెప్పుకొచ్చారు.
ఇక పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి ఏం చేయాలో అన్నీ చేస్తామని బీజేపీ నేతలు చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. పార్లమెంట్ లో చట్టం చేశాక కేబినెట్ మీటింగ్ లో అంచనా వ్యయం తగ్గించడానికి వీల్లేదని ఉండవల్లి స్పష్టం చేశారు.
బీజేపీతో విడిపోవాలని తాము వైసీపీ ప్రభుత్వానికి చెప్పడం లేదని ఉండవల్లి అన్నారు. తనపై ఉన్న కేసుల గురించి జగన్ నోరెత్తడం లేదనే ప్రచారం సాగుతోందన్నారు.
పోలవరం ప్రాజెక్ట్ వైఎస్ఆర్ మానస పుత్రిక అని.. ఈ ప్రాజెక్ట్ కు వైఎస్ఆర్ పేరు పెట్టాలని తాము డిమాండ్ చేశామని ఉండవల్లి గుర్తు చేశారు.
ఇక రాష్ట్రంలో వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి ఏడాదిన్నర అయినా కేంద్రాన్ని ఈ ప్రాజెక్ట్ విషయమై ఎందుకు గట్టిగా అడగడం లేదని.. నోరు మెదపడం లేదని ఉండవల్లి ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఏపీ పునర్విభజన చట్టాన్ని ఉండవల్లి చదివి వినిపించారు.