నమ్మలేరు కాని నిజం..ఆ పావురం ధర రూ.11.48 కోట్లు
మనకు తెలిసిన ప్రపంచం చాలా.. చాలా చిన్నది. తెలియనిది చాలానే ఉంది. ఇప్పుడు చెప్పే విషయం ఆ కోవకు చెందినది. చాలామందికి చాలానే ఆసక్తులు ఉంటాయి. అలానే కొందరికి పావురాలంటే మహా ఆసక్తి. వాటిని పెంచుకోవటం.. పోటీల కోసం వాటికి శిక్షణ ఇవ్వటం లాంటివి చేస్తుంటారు. ప్రపంచ వ్యాప్తంగా పావురాలకు సంబంధించి భారీ బిజినెస్ నడుస్తోంది. కోడి పందెలు.. గుర్రం పందాలు ఎలానో.. పావురాల పందెలు కూడా ఆ కోవకే వస్తాయి. ఈ పందెల్లో పాల్గొనే వారు.. ఖరీదైన పావురాల కోసం కోట్లకు కోట్లు ఖర్చు చేస్తుంటారు.
అలా పావురాల పోటీ కోసం బెల్జియంకు చెందిన హోక్ అనే పెద్ద మనిషి వివిధ జాతులకు చెందిన పావురాల్ని సేకరిస్తుంటారు. అంతేకాదు.. కొన్ని కొత్త జాతుల పావురాల్ని క్రియేట్ చేస్తుంటారు కూడా. అలా క్రియేట్ చేసిన కొత్త జాతి పావురాలకు శిక్షణ ఇచ్చి.. పోటీల్లోకి దింపి.. గెలిచేస్తుంటారు. ఇలా తాను తయారు చేసిన పావురాల్ని భారీ ధరలకు అమ్మేస్తుంటారు. అలాంటి ఆయన తాజాగా తాను రూపొందించిన కొత్తతరహా పావురం ‘న్యూ కిమ్’.
రెండేళ్లు వయసున్న ఈ పావురం ఇ స్పెషల్ గా ఆయన అభివర్ణిస్తుంటారు. దీని విశిష్ఠతల గురించి తనవెబ్ సైట్ లో ప్రత్యేకంగా పేర్కొనటమే కాదు.. pipa అనే ఆన్ లైన్ పోర్టల్ లో అమ్మకానికి పెట్టాడు. దీని గురించి తెలిసిన వారంతా ఈ పావురాన్ని సొంతం చేసుకోవటానికి తెగ ఉత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు. ఈ నెల 15 వరకు వేలాన్ని నిర్వహిస్తున్నారు. ఎవరైతే అత్యధిక ధర చెల్లిస్తారో.. వారికి ఆ పావురాన్ని ఇస్తారు.
ఇప్పటివరకు సదరు పావురం కోసం జరిగిన బిడ్డింగ్ లో అత్యధికంగా రూ.11.48కోట్లు పెట్టేశారు. వాస్తవానికి ఆ పావురాన్ని బిడ్డింగ్ లో పెట్టినప్పుడు ప్రారంభ ధర రూ.17.5వేలు మాత్రమే. అయితే.. దాని విశిష్టతలు తెలుసుకున్న తర్వాత నుంచి దాన్ని సొంతం చేసుకోవటానికి పలువురు ముందుకు వస్తుండటంతో దాని డిమాండ్ అనూహ్యంగా మారిపోయింది. ఇప్పుడే ఇంత ధర పలుకుతున్న ఈ పావురం వేలం చివరి నాటికి ఎంత ధర పలుకుతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కోట్లు పలుకుతున్న ఈపావురం సంరక్షణ కోసం ఒక ప్రైవేటు సెక్యురిటీ సంస్థ ద్వారా సెక్యురిటీని ఇస్తున్నారట.