సంచలనం.. అమెరికా యుద్ధ నౌకను చుట్టుముట్టిన ఫ్లాయింగ్ సాసర్లు?

Update: 2021-05-30 04:30 GMT
సంచలన నిజాన్ని ప్రపంచానికి వెల్లడించాడు అమెరికాకు చెందిన షార్ట్ ఫిలిం దర్శకుడు. అధికారిక వీడియో ఫుటేజ్ ను బయటపెట్టటం ద్వారా ప్రపంచం మరో కొత్త అంశం గురించి మాట్లాడుకునే అవకాశాన్ని కల్పించాడు. ఏళ్లకు ఏళ్లుగా మనిషికి ఒక పట్టాన.. అంతుపట్టిన అంతరిక్షంలో మనం కాకుండా మరో గ్రహవాసులు ఉంటారని.. టెక్నాలజీ పరంగా వారు మనకంటే వందల రెట్లు ముందుంటారన్న అంచనాలు వినిపిస్తున్నా.. వాటిని వాస్తవమన్న విషయం ఇప్పటివరకు వెల్లడైంది లేదు.

తాజాగా చిట్టి చిత్రాల దర్శకుడు జెరీమీ కార్బెల్ ఒక సంచలన ప్రకటన చేశాడు. 2019 జులైలో కాలిఫోర్నియాలోని శాన్ డియోగో తీరానికి చేరువలో అమెరికాకు చెందిన యుద్ధ నౌకను కొన్ని ఫ్లయింగ్ సాసర్లు చుట్టి ముట్టినట్లుగా పేర్కొన్నారు. దీనికి సంబంధించిన రాడార్ విజువల్స్ ను ఆయన విడుదల చేశారు. ఇందులో తొమ్మిది వస్తువులు యుద్ధ నౌకకు దగ్గరగా రావటం కనిపించింది.

అవి గంటకు 70 నుంచి 250 కిలోమీటర్ల వేగంగా ప్రయాణించినట్లుగా పేర్కొన్నారు. ఒమాహా యుద్ధ నౌకతో పోలిస్తే.. ఇది దాదాపు మూడు రెట్లు ఎక్కువగా పేర్కొన్నారు. కాసేపటి నతర్వాత అవి మాయమైనట్లుగా చెప్పారు. మన రాడార్ పరిధికి అందకుండా వెళ్లిపోయి ఉంటాయని ఆయన చెబుతున్నారు. అయితే.. చాలా ఎత్తుకు కానీ.. లేదంటే సముద్రంలోని కానీ అవి చేరి ఉండొచ్చన్న వాదనను వినిపిస్తున్నారు. ఇతగాడు విడుదల చేసిన వీడియో అసలైనదేనంటే అమెరికా రక్షణ శాఖ ధ్రువీకరించటం గమనార్హం.  

అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా సైతం ఈ మధ్యనే ఫ్లయింగ్ సాసర్ల గురించి ప్రస్తావిస్తూ.. తాను అధ్యక్షుడిగా ఉన్న వేళలో వీటి గురించి ఆరా తీసినట్లు చెప్పారు. ఆకాశంలో గుర్తు తెలియని కొన్ని వస్తువులకు సంబంధించిన వీడియోలు ఉన్నాయని.. వీటిపై సమగ్ర సమాచారాన్ని తేల్చేందుకు అగ్రరాజ్యం ఒక టాస్క్ ఫోర్సును ఏర్పాటు చేయటం తెలిసిందే. జూన్ లో దీనికి సంబంధించిన ఒక అధికారిక నివేదికను వెల్లడించే అవకాశం ఉందని చెబుతున్నారు. చూస్తుంటే.. జూన్ లో గ్రహాంతరవాసికి సంబంధించిన సంచలన అంశాలు బయటకు రానున్నాయన్న మాట.
Tags:    

Similar News