సమ్మర్ సీజన్ అలర్ట్... బీర్ తో 'చిల్'పడిపోద్ది జాగ్రత్త..!

సాధారణంగా కొంతమంది వర్కింగ్ పీపుల్ వీకెండ్స్ లో.. కాలేజీ విద్యార్థులు, మరికొంతమంది ప్రొఫెషనల్ డ్రింకర్స్ వంటి వారు రెగ్యులర్ గా మందు, బీరు తాగుతారనే సంగతి తెలిసిందే!;

Update: 2026-02-12 18:30 GMT

సాధారణంగా కొంతమంది వర్కింగ్ పీపుల్ వీకెండ్స్ లో.. కాలేజీ విద్యార్థులు, మరికొంతమంది ప్రొఫెషనల్ డ్రింకర్స్ వంటి వారు రెగ్యులర్ గా మందు, బీరు తాగుతారనే సంగతి తెలిసిందే! పైగా కొత్తగా బయట ప్రపంచంలోకి అడుగుపెట్టామని, తమకు లోక జ్ఞానం వచ్చేసిందని, సమాజం అంటే ఏమిటో తెలిసిపోయిందని భావించే పలువురు యువకులు.. బీరు తాగడాన్ని ఒక ఫ్యాషన్ గా, అప్ డేట్ అయ్యామని చెప్పడానికి సింబల్ గా భావిస్తుంటారని అంటారు. ఈ క్రమంలో ఓ బిగ్ అలర్ట్ తెరపైకి వచ్చింది.

అవును... యువకులకు బీర్ తాగడం ఓ ఫ్యాషన్ లా మారిపోయిందని చెప్పొచ్చు. చల్లని బీర్ చేతితో పట్టుకుని, అది తాగుతూ, ఫ్రెండ్స్ తో కబుర్లు చెప్పుకుంటూ ఉంటే సంతోషమే వేరని చాలా భావిస్తుంటారనీ అనొచ్చు. ఇక ప్రధానంగా.. ఎండలు పెరుగుతున్నాయి, ఇంకో నెల అయ్యిందంటే సూర్య భగవానుడు ఎర్రెక్కి పోతాడు.. దీంతో.. ఏ మాత్రం అవకాశం దొరికినా వెంటనే చిల్ బీర్ తాగేస్తుంటారు కుర్రాళ్లు! అయితే అది ఏమాత్రం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు!

బీర్ లోనూ ఆల్కహాల్ ఉండటం వల్ల అది పూర్తిగా సురక్షిత పానియం కాదని.. వరుసపెట్టి రెండు మూడు లేపెయ్యడం వలనా.. రెగ్యులర్ గా తాగడం వల్ల శరీరానికి గణనీయమైన నష్టం కలగవచ్చని చెబుతున్నారు. ఇందులో ముందుగా కడుపు చుట్టూ కొవ్వు పేరుకుపోవచ్చని చెబుతున్నారు. దీన్నే బీర్ బెల్లీ అని అంటారు. దీనివల్ల అధిక బరువు, ఊబకాయం.. ఫలితంగా డయాబెటిస్, హై బ్లడ్ ప్రెషర్ వంటి సమస్యలకు దారి తీయవచ్చని అంటున్నారు.

ఇక పైకి కనిపించే అధిక బరువు, ఊబకాయం సంగతి అలా ఉంచితే.. ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం వల్ల పొట్ట లోపలి పొరను దెబ్బతింటుందని.. తద్వారా అల్సర్, గ్యాస్ట్రైటిస్ వంటి సమస్యలు వస్తాయని.. ఇదే క్రమంలో కిడ్నీలపైనా ఒత్తిడి పెరిగి, దీర్ఘకాలంలో వాటి పని తీరు దెబ్బతినే ప్రమాదం పుష్కలంగా ఉందని అంటున్నారు. ఇక ప్రధానంగా... ఈ ఎఫెక్ట్ లివర్ పై ఎక్కువగా ఉంటుందని.. అదేపనిగా ఆల్కహాల్ తీసుకునేవారికి ఫ్యాటీ లివర్, సిర్రోసిస్ వంటి ప్రమాధకర వ్యాధులు వచ్చే అవకాశాలకు లోటు లేదని చెబుతున్నారు.

ఇది ఇక్కడితో అయిపోలేదు.. ఈ ప్రభావం గుండె, మెదడు పనితీరుపైనా కీలక ప్రభావం చూపొచ్చని చెబుతున్నారు. ఇందులో భాగంగా... జ్ఞాపకశక్తి తగ్గడం, డిప్రెషన్ కి గురవ్వడం, ఏకాగ్రత లోపించడం వంటి సమస్యలతో పాటు... గుండెకు సంబంధించి హై బ్లడ్ ప్రెషర్, స్ట్రోక్, హార్ట్ అటాక్ వంటి ప్రమాదాలకు అవకాశం ఉందని చెబుతున్నారు. ఫైనల్ గా చెప్పొచ్చేదేమిటంటే... మద్యపానం ఆరోగ్యానికి హానికరం! ఎండలు మండిపోతున్నాయని బీర్లు తాగేయడం వల్ల ఆరోగ్యానికి చిల్లు పడటం ఖాయమన్నమాట!

Tags:    

Similar News