రెండున్నరేళ్ల వైసీపీ పాలన.. తీపెంత? చేదెంత?
వైసీపీ పాలనకు రెండున్నరేళ్లు. ఏపీ ముఖ్యమంత్రిగా.. వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేసి.. నేటికి (మంగళ వారం) సరిగ్గా రెండున్నర సంవత్సరాలు. రాజన్న రాజ్యం తీసుకువస్తానని.. ఒక్క ఛాన్స్ ఇవ్వాలని.. ఎన్నిక ల సమయంలో ఆయన చేసిన అభ్యర్థనలు.. పాదయాత్ర వెరసి.. ఏపీలో వైసీపీ తొలిసారి.. అధికారంలోకి వచ్చింది. తొలి ఆరు మాసాల్లోనే తనేంటో నిరూపించుకుంటానని.. ప్రమాణ స్వీకారం చేసిన రోజే.. జగన్ ప్రకటించారు. మంచి ముఖ్యమంత్రి అనిపించుకుంటానని ఆయన చెప్పారు.
సరే! ఇప్పటికి రెండున్నరేళ్లు గడిచాయి. మరో రెండున్నరేళ్లరేళ్లు మిగిలి ఉన్నాయి. గడిచిన కాలాన్ని పరిశీ లిస్తే.. ప్రజలకు సంక్షేమ పథకాల పేరుతో అమలు చేయడం ద్వారా.. ఒకింత లబ్ధి చేకూరిందనే చెప్పాలి. అదేసమయంలో పేదలకు ఇళ్లు, పింఛన్లను ఇంటింటికీ పంపిణీ చేయడం.. వంటివి ప్రభుత్వ మార్కుగానే మారింది. ఇక, వలంటీర్ వ్యవస్థ, సచివాలయాల ఏర్పాటు.. వంటివి ఆశించిన ఫలితాన్ని ఇచ్చాయి. నాడు-నేడు.. అమ్మ ఒడి వంటి పథకాలు.. వైసీపీకి ఓటు బ్యాంకుగా వాడుకునేందుకు కలిసి వచ్చాయనడంలో సందేహం లేదు.
మొత్తంగా ఈ రెండున్నరేళ్లలో.. ``ఇవ్వడం`` అనే కాన్సెప్టు ద్వారా.. జగన్ మంచి మార్కులే వేయించుకు న్నారు. అయితే.. నాణేనికి రెండో వైపు చూస్తే.. అప్పులు.. విమర్శలు.. రాజధాని ఉద్యమాలు.. ఎస్సీ, ఎస్టీలపై దాడులు.. కమ్మ సామాజిక వర్గం పై దూకుడు.. వెరసి.. రాష్ట్రంలో ఏం జరుగుతోందనే భయం వెంటాడిన సందర్భాలు ఉన్నాయి. భావ ప్రకటన కు స్వేచ్ఛ లేకుండా పోయిందనే చెప్పాలి. డాక్టర్ సుధాకర్ ఘటన దీనికి మచ్చుతునక. ఇక, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను హైఊకోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు కొట్టివేయడాలు.. అనంతరం.. న్యాయ పాలికనే దూషించడం.. కేసులు.. ఇలా.. మంచి కన్నా.. చెడు పాలు ఎక్కువగానే ఉందని.. వైసీపీలోని తటస్త నేతలే అంగీకరించిన వాస్తవం.
పోనీ.. ఈ రెండున్నరేళ్లలో జగన్ ఇచ్చిన హామీలను పరిశీలిస్తే.. కీలకమైన ప్రత్యేకహోదా.. వెనుకబడిన జిల్లాల కు నిధులు.. పోలవరం ప్రాజెక్టు పూర్తి, రాజధాని.. పొరుగు రాష్ట్రాలతో సఖ్యతగా ఉంటూ.. రాష్ట్ర ప్రయోజనాలు సాధించే వ్యూహం.. వంటివాటి విషయంలో పూర్తిగా జగన్ విఫలమయ్యారనే వాదన బలంగా వినిపిస్తోంది. ఇక, ఉద్యోగాల కల్పన, పెట్టుబడుల రాక, మేలిమి నిర్ణయాలతో ఆర్థికానికి ఊతం.. వంటివి ఎక్కడా కనిపించడం లేదు. పైగా ఉన్న ఆస్తులను.. నిధులను కరిగించుకునే ప్రక్రియను వడివడిగా చేపడుతున్నారు. ఇదీ.. ఈ రెండున్నరేళ్ల పాలనలో.. జగన్ సాధించిన రికార్డు!!