అర్బన్ నక్సల్స్.. తుక్డేతుక్డే గ్యాంగ్ అంటే తెలీవట
ఇటీవల వార్తల్లోనూ.. కొందరు పోలీసు అధికారుల నోటి నుంచి కొన్ని మాటల్ని తరచూ వింటున్నాం. అందులో ముఖ్యమైనది అర్బన్ నక్సల్స్.. తుక్డేతుక్డే గ్యాంగులని. పట్టణ ప్రాంతాల్లో ఉంటూ.. మావోలకు సానుభూతిపరులుగా ఉండే వారిని అర్బన్ నక్సల్స్ గా పిలుస్తున్నారు. ఈ పేరుతో పలువురిని అదుపులోకి తీసుకోవటం వార్తల్లో చూస్తున్నదే. ఇలాంటి వేళ.. అసలు అర్బన్ నక్సల్స్ అంటే ఏమిటి? దానికున్న అర్థం ఏమిటి? చట్టంలో వాటి గురించి ఏం చెబుతున్నారు? అన్న సందేహంతో పాటు.. ఈ మధ్యన అదే పనిగా వినిపిస్తున్న తుక్డే తుక్డే గ్యాంగ్ ఎక్కడుందన్న ప్రశ్న కలిగిందో మీడియా సంస్థకు.
తమకొచ్చిన సందేహాన్ని తీర్చుకునేందుకు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే సమాచారహక్కుచట్టం కింద ఒక దరఖాస్తు చేసుకున్నారు. తాజాగా సదరు మీడియా సంస్థకు ఆర్టీఐ నుంచి సమాధానం లభించింది. అర్బన్ నక్సల్స్ అంటే ఎవరో తెలీదని.. వారు ఎక్కడ నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తారన్న విషయం తమకు తెలీదని పేర్కొంటూ ఒక నోట్ ఇచ్చారు.
అంతేకాదు.. తుక్డే తుక్డే గ్యాంగ్ ఎక్కడ ఉంటుందన్న విషయం కూడా తమకు తెలీదని పేర్కొనటం గమనార్హం.మరి.. తమకే మాత్రం అవగామన లేదని కేంద్రం ఓపక్క చెబుతున్నప్పుడు.. ఈ పేరుతో పోలీసులు చేసే అరెస్టులు.. అదుపులోకి తీసుకొని విచారించటాల సంగతేమిటి? అన్నదిప్పుడు ఆసక్తికర ప్రశ్నగా మారిందని చెప్పక తప్పదు.