శ్రీవారి ఆస్తులపై టీటీడీ కీలక నిర్ణయం

Update: 2020-08-18 13:34 GMT
భక్తులు కానుకగా ఇచ్చినవి.. ఇక తిరుమల తిరుపతి దేవస్థానానికి స్వతహాగా ఉన్న ఆస్తులను విక్రయించాలని గతంలో టీటీడీ నిర్ణయించింది. అవన్నీ వివిధ రాష్ట్రాల్లో అన్యాక్రాంతం కావడం.. కబ్జాకు గురి అవుతున్నట్టు దృష్ట్యా టీడీపీ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయని బీజేపీ సహా కొన్ని పక్షాలు ఆందోళన చేశాయి.

దీంతో ఈ వ్యవహారం హైకోర్టుకు చేరింది. శ్రీవారి ఆస్తులను ఇకపై విక్రయించకూడదని తిరుమల తిరుపతి దేవస్థానం తీర్మానం చేసింది. ఈ మేరకు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఏపీ హైకోర్టుకు నివేదించారు.

తమిళనాడులో 23 ఆస్తులను విక్రయించాలని టీటీడీ నిర్ణయించిందని.. ఆ వేలాన్ని అడ్డుకోవాలని బీజేపీ నేత అమర్ నాథ్ హైకోర్టులో పిల్ వేశారు. దీనిపై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు నివేదిక సమర్పించాలని టీటీడీ పాలకమండలిని ఆదేశించింది.

ఈ నేపథ్యంలోనే టీటీడీ ఈవో హైకోర్టుకు అఫిడవిట్ సమర్పించారు. ఆస్తుల సంరక్షణ కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించామన్నారు. ఇక ఏపీ ప్రభుత్వం కూడా ఆస్తుల విక్రయాన్ని నిషేధిస్తూ మే 25న జీవో జారీ చేసింది.
Tags:    

Similar News