ఆ మాట ఇచ్చి.. రాధ తల మీద చెయ్యి పెట్టి మరీ ఒట్టేసిన సీఎం జగన్

Update: 2021-12-04 06:14 GMT
రెండు రోజుల క్రితం టీటీడీకి చెందిన మహిళా ఉద్యోగి రాధ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారటమే కాదు..సోషల్ మీడియాలో ఆమె ఆవేదన అందరిని కదలించి వేసింది. ఆమె మాట్లాడిన వీడియో క్లిప్ ను సీఎం జగన్ వరకు వెళితే బాగుంటుందని అనుకున్నోళ్లు వేలాదిగా ఉన్నారు.

సీఎం జగన్మోహన్ రెడ్డి అంటే విపరీతమైన అభిమానమే కాదు.. జగనన్న పచ్చ బొట్టును తన చేతి మీద వేయించుకోవటమే కాదు.. 2019 ఎన్నికల్లో జగన్ సాధించిన అద్భుత విజయం నేపథ్యంలో.. తిరుమల శ్రీవారికి తలనీలాల్ని ఇచ్చేసింది.

ఇలా.. జగన్ అంటే విపరీతంగా ప్రేమాభిమానులు కురిపించే ఆమె.. తాజాగా నిరసన దీక్ష చేపట్టటమే కాదు.. సీఎం జగన్ అంటే తనకెంత నమ్మకం.. ప్రేమాభిమానాలు అన్న విషయాన్ని వెల్లడించటమే కాదు.. తాజాగా ఆయన పని తీరు పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలు సాకింగ్ గా మారాయి. జగన్ అంటే వీరాభిమాని అయిన ఆమె.. తలనీలాలు సమర్పించేందుకు కించిత్ ఆలోచించ లేదు.

అంతటి అభిమానాన్ని ప్రదర్శించే ఆమె ఇప్పుడు జగన్ పాలన పై విమర్శలు చేయటమే కాదు.. హామీల అమలు విషయం లో వైసీపీ సర్కారు ఎంతలా వెనుకబడి పోయిందో చెప్పు కొచ్చారు. అంతే కాదు.. వచ్చే ఎన్నికల్లో ఓటమి ఖాయమని ఆమె శాపనార్థాలు పెట్టారు. దీం తో.. ఆమె ఒక్క సారిగా రెండు తెలుగు రాష్టరాల్లో సుపరి చితులుగా మారారు.

ఆమెను తాజాగా కలిశారు సీఎం జగన్మోహన్ రెడ్డి. దీంతో.. ఆమె ఉక్కిరి బిక్కిరి అయ్యారు. అదే సమయం లో తాము ఎదుర్కొంటున్న సమస్యల చిట్టాను ఏకరువు పెట్టారు.

టీటీడీ కార్మికుల సమస్యలు.. చాలీ చాలని జీతాలతో కార్మికులు పడుతున్న ఇబ్బందుల్ని ఆమె చెప్పుకొచ్చారు. ఏళ్లకు ఏళ్లుగా తమకు న్యాయం చేస్తామని చెబుతున్నా.. న్యాయం జరగటం లేదని వాపోయింది. దీంతో.. ఈ సమస్యను 24 గంటల్లో పరిష్కరిస్తానని చెప్పారు సీఎం జగన్. దీంతో.. స్పందించిన రాధ.. తన తల మీద చెయ్యి పెట్టి ఒట్టు వేయాలని జగన్ ను కోరారు.

దీనికి సానుకూలంగా స్పందించిన సీఎం జగన్.. ఆమె తల మీద చెయ్యి పెట్టి ఒట్టేశారు. వాళ్లు చేస్తున్న నిరసనను విరమించాలని పోలీసులు కోరారు.

మొత్తంగా జగన్ ను వీరాభిమానంతో కొలిచే.. చిరుద్యోగికి సీఎం స్థాయిలో ఉండి కూడా.. ఆమె కోరినట్లే ఒట్టు వేసి హామీ ఇచ్చిన జగన్.. తాను చెప్పినట్లే 24 గంటల్లో ఇష్యూను క్లోజ్ చేస్తారా? లేదా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పక తప్పదు.
Tags:    

Similar News