ఆ 57 మంది వేద పాఠశాల విద్యార్థుల ఆరోగ్యం పై స్పందించిన టీటీడీ చైర్మన్

Update: 2021-03-13 00:30 GMT
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పవిత్రమైన పుణ్యక్షేత్రం తిరుమలలో మళ్లీ  కరోనా వైరస్  మరోసారి విజృంభించింది. ఈ మద్యే  తగ్గుముఖం పట్టిన కరోనా వైరస్, మళ్లీ వ్యాపిస్తూనే ఉంది. తాజాగా తిరుమలలోని 57 మంది వేద పాఠశాల విద్యార్థులకు కరోనా సోకింది. గత నెలలోనే ఈ పాఠశాల ప్రారంభం కాగా,  450 మందికి కరోనా పరీక్షలు చేయించారు. అయితే ఈ పరీక్షల్లో ఏకంగా 57 మందికి కరోనా సోకింది. దీంతో ఆ విద్యార్థులను తిరుపతిలోని స్విమ్స్ ‌కి తరలించారు. డాక్టర్ల పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారు. వీరిలో కొంతమందికి కరోనా లక్షణాలు లేవని తెలుస్తోంది. ముందస్తు జాగ్రత్తగా పాజిటివ్‌ తేలిన విద్యార్థులకు దగ్గరగా ఉన్న వారిని క్వారంటైన్‌ లో ఉంచారు. వీరంద‌రూ త‌మ స్వ‌స్థ‌లాల్లో  కరోనా  ఆర్ ‌టిపిసిఆర్ ప‌రీక్ష‌లు చేయించుకుని నెగెటివ్ రిపోర్టు స‌మ‌ర్పించారు. అయితే, మార్చి 9న విద్యార్థులంద‌రికీ మ‌రొక‌మారు క‌రోనా ర్యాపిడ్ ప‌రీక్ష నిర్వ‌హించ‌గా, ఎలాంటి వ్యాధి ల‌క్ష‌ణాలు లేక‌పోయినా 57 మంది విద్యార్థుల‌కు పాటిజివ్ రిపోర్టు వ‌చ్చింది.

విద్యార్థుల‌కు ఎలాంటి ఇబ్బందులు త‌లెత్త‌కుండా టిటిడి అన్ని ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌లు తీసుకుంటోంది. ఈ నేప‌థ్యంలో మిగిలిన 378 మంది విద్యార్థుల‌కు, 35 మంది అధ్యాప‌కుల‌కు, 10 మంది ఇత‌ర సిబ్బందికి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా, అంద‌రికీ నెగెటివ్ రిపోర్టు వ‌చ్చింది. దీనిపై తాజాగా టీటీడీ ఛైర్మెన్ వై వి సుబ్బారెడ్డి స్పందించారు. కరోనా భారిన పడ్డ 57 మంది వేద పాఠశాల విద్యార్థులు ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు. ఎప్పటికప్పుడు విద్యార్థుల పరిస్థితిని సమీక్షిస్తున్నాం అని చెప్పారు. ఆ తిరుమల శ్రీవారి ఆశీస్సులతో త్వరలోనే విద్యార్థులందరూ కోలుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆ తర్వాత వేద పాఠశాలని పరిశీలించించారు. హాస్టల్ లో ఒక్కొక్క రూమ్ లో నలుగురు విద్యార్థులు మాత్రమే ఉండాలని అన్నారు.
Tags:    

Similar News