టీఎస్ పీఎస్సీ ఛైర్మన్ ఔట్ ?

Update: 2023-03-19 15:00 GMT
క్వశ్చన్ పేపర్ల లీకేజీ వ్యవహారంపై కెసిఆర్ టీఎస్ పీఎస్సీ బోర్డు ఛైర్మన్ జనార్ధనరెడ్డిపై మండిపోయినట్లు సమాచారం. ఛైర్మన్ను ప్రగతిభవన్ కు పిలిపించుకుని పేపర్ల లీకేజీ వ్యవహారంపై వివరణ అడిగారట. ఎంతో పకడ్బందీగా జరగాల్సిన ప్రవేశపరీక్షలు ఎందుకింతగా వివాదాస్పదమయ్యాయో సమాధానం చెప్పాలని నిలదీశారట. బోర్డు నిర్లక్ష్యం కారణంగానే ఇపుడు ప్రభుత్వం తలదించుకోవాల్సిన పరిస్ధితులు ఏర్పడినట్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారని సమాచారం. బోర్డు నిర్లక్ష్యానికి ప్రభుత్వం మూల్యం చెల్లించుకోవాల్సొస్తోందని ఆక్షేపించారట.

రెండు ప్రవేశపరీక్షలను రద్దచేసినందుకు జనాలకు ముఖ్యంగా పరీక్షలు రాసిన వేలాదిమంది నిరుద్యోగులకు ఎవరు సమాధానం చెప్పాలని ఛైర్మన్ను కెసిఆర్ నిలదీసినట్లు సమాచారం. అందరు కలిసి ప్రభుత్వం పరువును తీసేశారంటు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారట. కెసిఆర్ ఆగ్రహం చూసిన తర్వాత ఛైర్మన్ కు ఏమిచెప్పాలో దిక్కుతోచలేదట. పేపర్ల లీకేజీ వ్యవహారంకు సంబంధించిన వివరాలను కెసిఆర్ కు ఛైర్మన్ వివరించినట్లు తెలుస్తోంది.

అయితే ప్రతిపక్షాలేమో మంత్రి కేటీఆర్ ను నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలి లేదా బర్త్ రఫ్ చేయాలని కెసిఆర్ ను డిమాండ్ చేస్తున్నాయి. ఇదే సమయంలో నిరుద్యోగులేమో టీఎస్ పీఎస్సీ బోర్డును రద్దుచేయాలని గోలగోల చేస్తున్నారు. రెండింటిలో ఏది జరుగుతుంది అనుకుంటే ముందు బోర్డు ఛైర్మన్ రాజీనామా కే అవకాశముందని పార్టీ వర్గాలు చెప్పాయి. సమస్యంతా టీఎస్ పీఎస్సీ బోర్డులోనే ఉందికాబట్టి  ముందు ఛైర్మన్ జనార్ధనరెడ్డి పైనే వేటు పడటం ఖాయమనే ప్రచారం పెరిగిపోతోంది.

ఛైర్మన్ తో రాజీనామా చేయించటం కూడా కెసిఆర్ కు చాలా తేలిక. ఇదే సమయంలో కేటీయార్ తో రాజీనామా చేయించటమంటే అది కెసిఆర్ వ్యక్తిగత ప్రతిష్టకు ఇబ్బందిగా మారుతుందని నేతలంటున్నారు. నాలుగైదు రోజుల్లో జరగబోయే పరిణామాలపైనే ఛైర్మన్ రాజీనామా విషయం తేలిపోతుందని అందరు అనుకుంటున్నారు. ప్రభుత్వం తీసుకోబోయే చర్యలపై ప్రతిపక్షాలు, నిరుద్యోగులు గనుక శాంతిచకపోతే అప్పుడు ఛైర్మన్ రాజీనామా తప్పదని ప్రగతిభవన్ వర్గాలు అంటున్నాయి. మరి పరిణామాలు ఎలాగ సాగుతాయో, కెసిఆర్ ఏమి నిర్ణయం తీసుకుంటారో, ఛైర్మన్ భవిష్యత్తు ఏమిటో తొందరలోనే తేలిపోవటం ఖాయమనే అనిపిస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News