అమెరికా నిఘా వ్యవస్థలపై ట్రంప్ షాకింగ్ కామెంట్స్..!

Update: 2023-01-31 23:00 GMT
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన వ్యవహార శైలి కారణంగా నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. అయితే ముందు వెనుక ఆలోచించకుండా ఆయన చేస్తున్న కామెంట్స్ తో ఆయన ఇరకాటంలో పడుతున్నారు. గతంలోనూ అమెరికా నిఘా వ్యవస్థలను తక్కువ చేసి మాట్లాడి విమర్శల పాలైన ట్రంప్ మరోసారి ఆ తరహా వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు.

తన నమ్మకాలు మారాయంటూ తన సోషల్ మీడియాలో ప్లాట్ ఫాం ట్రూత్ లో ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. అమెరికాలోని సీఐఏ.. నాసా.. ఎఫ్బీఐ వంటి సైబర్ సెక్యూరిటీ సంస్థల్లో పనిచేసే వారి కంటే కూడా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పైనే ఎక్కువ నమ్మకం ఉందని ట్రంప్ పేర్కొన్నాడు. అమెరికా నిఘా వ్యవస్థలను తక్కువ చేసి మాట్లాడమే కాకుండా మధ్యలో పుతిన్ ను కీర్తించడంపై పలువురు ఆయనపై విమర్శలు గుప్పిస్తున్నారు.

ట్రంప్ వ్యాఖ్యలపై రిపబ్లికన్లతో పాటు డెమొక్రాట్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అమెరికాలోని నిఘా విభాగంలో పని చేసే వారికి తక్కువ చేసి మాట్లాడటం సరికాదంటూ ట్రంప్ వ్యాఖ్యలను అధికార.. ప్రతిపక్ష నేతలంతా ఖండిస్తున్నారు.

కాగా 2016 యూఎస్ ఎన్నికల్లోనూ రష్యా అధ్యక్షుడి ప్రమేయం ఉందని ఇంటిలిజెన్సీ నిర్ధారించడాన్ని కూడా ట్రంప్ అంగీకరించి గతంలో విమర్శలకు గురయ్యాడు.
 
దీని వల్ల యూఎస్ న్యాయశాఖకు చెందిన ప్రత్యేక న్యాయవాది రాబర్ట్ ముల్లర్ నేతృత్వంలోని అతని అంతర్గత సిబ్బంది ఏళ్ల తరబడి విచారణను ఎదుర్కోవాల్సి వచ్చింది. అంతేకాకుండా ఈ వ్యాఖ్యలు ట్రంప్ రాజకీయ జీవితాన్ని కొంతమేర నష్టపరిచాయి. చివరికి అధ్యక్షుడిపై ఎలాంటి చర్యలు తీసుకోలేక పోవడమే కాక సంబంధం లేని వ్యక్తులు ఇందులో విచారణ ఎదుర్కోవాల్సి వచ్చింది.

ఇదిలా ఉంటే ఇటీవల ట్రంప్ తాను అధ్యక్షుడిగా ఉండి ఉంటే రష్యా-ఉక్రెయిన్ వార్ ను ఆపేవాడనంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి ట్రెండింగ్ లో నిలిచారు. అది మరువక ముందే రష్యా అధ్యక్షుడిపై అనూహ్య వ్యాఖ్యలతో మరోసారి ట్రంప్ ట్రోలింగ్ కు గురవుతున్నాడు. ఏది ఏమైనా ట్రంప్ వ్యవహర శైలి మాత్రం అందరికీ కంటే భిన్నమని మరోసారి ఆయన వ్యాఖ్యలతో నిరూపితమైంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News