ట్రంప్ తాజా వ్యాఖ్యలతో కిమ్ ఆరోగ్యంపై క్లారిటీ వచ్చినట్లే
మంచి చెప్పటానికి ఎవరికి ఎలాంటి అభ్యంతరం ఉండదు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ లాంటి అధినేతను అయితే ఆపేటోడే ఉండదు. శుభవార్త చెప్పేందుకు మొహమాటపడరు కానీ.. దుర్వార్త చెప్పే విషయంలో ఆచితూచి అన్నట్లు వ్యవహరిస్తారు. ప్రశ్న ఏదైనా సరే.. మొహమాటం లేకుండా మాట్లాడేసినట్లుగా వ్యాఖ్యలు చేసే ట్రంప్.. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జొంగో ఉన్ ఆరోగ్య పరిస్థితిపై మాత్రం తన ధోరణికి భిన్నంగా వ్యవహరించారు.
కిమ్ ఆరోగ్యం ఏ మాత్రం బాగోలేదని.. ఆయన బ్రెయిన్ డెడ్ అయినట్లుగా వార్తలు రావటం తెలిసిందే. వీటిని ఖండిస్తూ ఒక అధికారిక నోట విడుదలైనట్లు చెబుతున్నా.. ఆయన ఆరోగ్యంపై మాత్రం అనుమానాలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. తాజాగా మీడియాతో మాట్లాడే సందర్భంలో అమెరికా అధ్యక్షుల వారి నోటి నుంచి వచ్చిన వ్యాఖ్యల్ని అండర్ లైన్ పెట్టుకుంటూ చదివితే అసలు విషయం ఇట్టే అర్థమై పోతుంది.
కిమ్ ఆరోగ్య పరిస్థితిపై తనకు సరైన అవగాహన ఉందన్న ట్రంప్.. ఆయన చనిపోయినట్లుగా వస్తున్న వార్తలపై తాను మాట్లాడలేనని చెప్పారు. కిమ్ కు అంతా మేలే జరగాలని తాను కోరుకుంటున్నట్లుగా చెప్పారు. త్వరలోనే కిమ్ ఆరోగ్య సమాచారం అందరికి తెలుస్తుందని చెప్పటం చూస్తే.. అంతా బాగుంటే.. ఆల్ ఈజ్ వెల్ అని చెప్పేయొచ్చు.
అందుకు భిన్నంగా తాను మాట్లాడలేనన్న ట్రంప్ మాట తేడా కొట్టేస్తుందని చెప్పక తప్పదు. అవగాహన ఉందంటూనే క్లారిటీ ఇవ్వలేనని చెప్పటం చూస్తే.. కిమ్ ఆరోగ్యం అనుకున్నంత మెరుగ్గా లేదన్న విషయాన్ని తన మాటలతో క్లారిటీ ఇచ్చినట్లుగా చెప్పక తప్పదు. కిమ్ కు అంతా మేలే జరగాలని ట్రంప్ కోరుకోవటం చూస్తే.. ఉత్తర కొరియా అధ్యక్షుల వారి యవ్వారం తేడాగా ఉందన్న విషయాన్ని చెప్పకనే చెప్పేసినట్లుగా చెప్పాలి.