లోకేష్‌కు దూకుడే కాదు.. దాటవేతా ముఖ్యమే.. !
టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులైన మంత్రి నారా లోకేష్ దూకుడు గురించి అందరికీ తెలిసిందే.;
టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులైన మంత్రి నారా లోకేష్ దూకుడు గురించి అందరికీ తెలిసిందే. విషయంఏదైనాఆయన దూకుడుగా స్పందిస్తారు. ఏ విషయాన్నీ ఆయన వదిలి పెట్టరు. ఎక్క డ ఎలాంటి యాక్షన్ ఉన్నా.. వెంటనే రియాక్ట్ అవుతారు. ఇది మంచిదే. నిన్న మొన్నటి వరకు ఆయన దూకుడు కారణంగానే ఇటు పార్టీలోను.. అటు ప్రజల్లోనూ హైలెట్ అయ్యారు. అయితే.. ఇప్పుడు కీలక బాధ్యతలు చేపట్టిన తర్వాత.. ఆయనలో మార్పులు అవసరమని సీనియర్లు చెబుతున్నారు.
భవిష్యత్తులో టీడీపీని నడిపించబోయేది ఆయనే కాబట్టి.. కొన్ని పద్ధతులను విధానాలను కూడా అలవరు చుకోవాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. ``ఇప్పటి వరకు ఎలా ఉన్నా.. పెద్దగా ఇబ్బంది లేదు. చంద్రబాబు సమర్థవంతంగా నడిపిస్తున్నారు. కానీ.. ఇక నుంచి పార్టీ వేసే ప్రతి అడుగులోనూ నారా లోకేష్ ముద్ర కనిపిస్తుంది. ఆయన ఎలా వ్యవహరిస్తున్నారన్న చర్చ కూడా ఉంటుంది. కాబట్టి.. ఇక నుంచి ఆయన మరింత జాగ్రత్తగా అడుగులు వేయాలి`` అని తూర్పుగోదావరికి చెందిన సీనియర్ నాయకుడు ఒకరు సూచించారు.
ఇప్పటి వరకు.. పార్టీ పరంగా లోకేష్ దూకుడుగానే ఉన్నారు. కానీ, ఇక నుంచి పార్టీలో ఆయన నెంబర్ 2 అనడంలో ఎలాంటి సందేహం లేదని స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో నాయకులు, కార్యకర్తలపై ఇప్పు డున్న దూకుడు స్వభావం చూపిస్తే.. ఇబ్బంది వస్తుందని అంటున్నారు. అన్ని విషయాల్లోనూ ఒకే విధం గా స్పందించడం కంటే.. సమయం, సందర్భం చూసుకుని నాయకుల విషయంలో స్పందించాలని కోరుతున్న వారు పెరుగుతున్నారు. ప్రధానంగా గాడి తప్పుతున్న నాయకులను ఎవరూ వెనుకేసుకురా వాలని కోరకపోయినా.. వీరి విషయంలో ఆచితూచివ్యవహరించక తప్పదని అంటున్నారు.
1) అందరినీ కలుపుకొనిపోవాలన్నది ప్రధాన సూచన. ఈ విషయంలో ఆది నుంచి కొంత తేడా కొడుతోంది. సీనియర్లకు నారా లోకేష్ దగ్గర సమయం ఉండడం లేదని అనేవారు ఉన్నారు.
2) జూనియర్లలోనూ ఒక వర్గాన్ని మాత్రమే ఆయన ఆదరిస్తున్నారన్న చర్చ కొన్నాళ్లు నడిచింది. దీనిని సరిచేసుకునే ప్రయత్నం చేశారు. కానీ.. ఇప్పుడు అందరినీ సమానంగా ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేయడంతోపాటు ఏ ప్రకటన చేసినా.. ఎలాంటి నిర్ణయాన్ని సూచించినా ఒకటికి రెండు సార్లు ఆలోచన చేయకతప్పదని అంటున్నారు.