అధికార మార్పికి నో అంటే నో అనేస్తున్న ట్రంప్.. మరీ ఇంత మొండితనమా?
మొండోడు రాజు అయితే ఎలా ఉంటుందో ఇప్పటివరకు చూశాం. ఇప్పుడు అదే రాజు దిగిపోయే టైమొచ్చినా.. అందుకు నో అనేస్తున్న వైనం ఇప్పుడు అమెరికాలో చోటు చేసుకుంది. రాజుకు పదవి వచ్చిన తర్వాత దిగటమా? దిగకపోవటమా? అన్నది రాజు ఇష్టం.అంతేకానీ.. అడ్డు చెప్పటానికి మీరెవరు? అన్నట్లుగా ట్రంప్ తీరు ఉంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్ విజయం సాధించినా.. ఆయన గెలుపును ఒప్పుకోని ట్రంప్.. న్యాయపోరాటానికి దిగుతామని చెప్పటమే కాదు.. చేతల్లోనూ అదే తీరును ప్రదర్శిస్తున్న వైనం ఇప్పుడు సంచలనంగా మారింది.
దీంతో.. అధికార బదిలీ ప్రక్రియ అంతకంతకూ సంక్లిష్టంగా మారుతోంది. ట్రంప్ తీరును పలువురు తప్పు పడుతుంటే.. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న రిపబ్లికన్ పార్టీ నేతలు కొందరు ట్రంప్ నకు తందాన అనటం ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే.. అధికార బదిలీ ప్రక్రియ అంతకంతకూ సంక్లిష్టం కావటంతో.. అధికారాన్ని సొంతం చేసుకోవాల్సిన బైడెన్ కు తలనొప్పిగా మారింది.
ఎన్నికల్లో అక్రమాలు జరగలేదని రిపబ్లికన్ పార్టీ మాజీ అధ్యక్షుడు జార్జి బుష్ జూనియర్ లాంటివారు చెబుతూ.. అధికార బదిలీని అంగీకరించాలని.. పదవి నుంచి హుందాగా దిగిపోవాలని చెబుతున్నా.. మొండి ట్రంప్ వారి మాటల్ని వినటం లేదు. దీంతో.. పలు సంక్లిష్టతలు చోటు చేసుకుంటున్నాయి. అమెరికా ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థికి కాబోయే అధ్యక్షుడిగా జనరల్ సర్వీసెస్ అడ్మినిస్ట్రేషన్ విభాగం గుర్తిస్తుంది. దీని తర్వాతే అధికార బదిలీ ప్రక్రియ షురూ అవుతుంది.
అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్ గెలుపొందినప్పటికీ జీఏస్ఎ విభాగం ఇప్పటివరకు ఆయన్ను గుర్తిస్తూ అధికారిక ప్రకటన చేయకపోవటమే కాదు..వారికి విడుదల చేయాల్సిన నిధుల్ని విడుదల చేయలేదు. దీనికి కారణం ఈ విభాగానికి చీఫ్ గా వ్యవహరిస్తున్న ఎమిలీ ముర్ఫీని ట్రంపే నియమించారు. అధికార మార్పిడికి సంబంధించిన లేఖపై సంతకం చేయటానికి ఆమె ఇప్పటివరకు నిర్ణయం తీసుకోలేదు. సాధారణంగా ఎన్నికల్లో విజయం సాధించిన వారికి ప్రతి ఫెడరల్ భవనంలో కార్యాలయం ఏర్పాటుకు స్థలం కేటాయించాలి. కోటి డాలర్ల నిధుల్ని అందజేయాలి.
స్థలాన్ని కేటాయించారు కానీ నిధుల్ని మాత్రం కేటాయించలేదు. ట్రంప్ నుంచి అనుమతి వస్తే కానీ జీఎస్ఏ బైడెన్ విజయాన్ని అధికారికంగా గుర్తించే అవకాశం లేదంటున్నారు. ఇలాంటి వ్యవహారాలతో అధికార బదిలీ ప్రక్రియ అంతకంతకూ సంక్లిష్టంగా మారుతోంది. మరోవైపు.. ఈ పరిస్థితిని తనదైన శైలిలో ఎదుర్కొనేందుకు బైడెన్ పావులు కదుపుతున్నారు. చూస్తుంటే..తన మొండితనంతో ట్రంప్ వేసే పీటముడులు అమెరికాను ప్రపంచం ముందు పలుచన చేయటం ఖాయమన్న మాట వినిపిస్తోంది.