చైనాపై మళ్లీ ట్రంప్‌ ఆగ్రహం .. ఈసారి ఎందుకంటే!

Update: 2021-06-04 08:30 GMT
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి చైనాపై విరుచుకుపడ్డారు. కరోనా వైరస్‌ ను ప్రపంచం మీదకు వదిలిన చైనాపై ఐక్యరాజ్యసమితి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రాణాంతక వైరస్‌ ను వ్యాపింపజేసినందుకు చైనా బాధ్యత వహించేలా చూడాలన్నారు. చైనా ప్రభుత్వంతో పాటు, ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించినందు వల్లే వైరస్‌ వ్యాప్తి చెందిందని ఆరోపించారు.కరోనా వైరస్  గురించి అసత్య ప్రకటనలు చేసేలా చైనీస్‌ కమ్యూనిస్టు డబ్ల్యూహెచ్‌ ఓను ప్రభావితం చేసిందని ఆరోపణలు చేశారు.

ఇక కరోనా వ్యాప్తి నేపథ్యంలో డొమెస్టిక్‌ విమానాలను రద్దు చేసి, తమ పౌరులను ఇళ్లల్లో బంధించిన చైనా, ఆ దేశ అంతర్జాతీయ విమానాలపై తాను నిషేధం విధించడాన్ని మాత్రం తీవ్రంగా ఖండించిందని, డ్రాగన్‌ ద్వంద్వ వైఖరికి ఇది నిదర్శనమని ట్రంప్‌ అప్పట్లో మండిపడ్డ సంగతి తెలిసిందే. ఒకరకంగా ట్రంప్ ఓటమి కి కారణం కూడా కరోనానే. కరోనా విజృంభణ సమయంలో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడారని , ప్రజల ప్రాణాలని పణంగా పెట్టి అమెరికా ఆర్ధిక వ్య‌వ‌స్థ గురించి ఆలోచించి కీలక నిర్ణయాలు తీసుకున్నారని విమర్శించారు. ఇక మరో ముఖ్యమైన కారణం బ్లాక్ లైవ్స్ మ్యాట‌ర్. అలాగే క‌రోనా మహమ్మారి క‌ట్ట‌డిలో విఫ‌లం అయ్యార‌ని విమ‌ర్శ‌లు వచ్చాయి. అదే స‌మ‌యంలో ట్రంప్ చైనాపై అనేక‌మార్లు విరుచుకుపడిన సంగ‌తి తెలిసిందే.  క‌రోనా వైర‌స్ చైనా నుంచే అమెరికాకు వ‌చ్చింద‌ని, ప్ర‌పంచం మొత్తం క‌రోనాతో అత‌లాకుత‌లం కావ‌డానికి చైనానే కార‌ణం అని ప‌లుమార్లు విమ‌ర్శించ‌డ‌మే కాకుండా, అమెరికాకు, ప్ర‌పంచానికి చైనా 10 ట్రిలియ‌న్ డాల‌ర్లు చెల్లించాలని డిమాండ్ చేశారు.  అంత‌ర్జాతీయ సంస్థ‌లు సైతం చైనా ల్యాబ్ నుంచే క‌రోనా వైర‌స్ బ‌య‌ట‌కు వ‌చ్చినట్టు తెలియజేశాయి.  దీనితో ట్రంప్ మ‌రోసారి చైనాపై విరుచుకుప‌డ్డారు.  చైనా నుంచే కరోనా  వైర‌స్ వ‌చ్చింద‌ని తాను ముందుగానే చెప్పాన‌ని, త‌ప్ప‌నిస‌రిగా చైనా భారీ మూల్యం చెల్లించాల‌ని ట్రంప్ మరోసారి చైనా పై విరుచుకుపడ్డాడు.
Tags:    

Similar News