ఓటమిని ఒప్పుకోని ట్రంప్ .. మళ్లీ అదే మాట
డోనాల్డ్ ట్రంప్ .. ఈ మద్యే జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్ చేతిలో పరాజయం పాలైన సంగతి తెలిసిందే. అయితే , ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ మాత్రం ఆ ఎన్నికల్లో ఓడిపోయినా నేనే గెలిచాను , నేను ఓడిపోలేదు అంటూ నానా రచ్చ చేస్తున్నారు. అధ్యక్ష ఎన్నికల్లో స్పష్టమైన తీర్పు వచ్చిన తర్వాత , ట్రంప్ లా ఫలితాలపై ఆరోపణలు చేసిన అమెరికా మాజీ అధ్యక్షులు ఎవరూ లేరు. తాజాగా మరోసారి ట్రంప్ మళ్లీ అదే మాట మాట్లాడుతున్నాడు.
ఎన్నికల్లో తానే అసలైన విజేతని మళ్లీ ప్రకటించుకున్నారు. పూర్తి స్థాయిలో రిగ్గింగ్ జరిగిన ఈ ఎన్నికల్లో మోసం చేసి మరీ బైడెన్ అధ్యక్ష పీఠం దక్కించుకున్నారని ఆరోపణలు చేశాడు. డెమొక్రాట్లు మోసం చేశారు. అధ్యక్ష ఎన్నికల్లో రిగ్గింగ్‌కి పాల్పడ్డారు. అలా రిగ్గింగ్ చేసిన ఎన్నికల్లో బైడెన్ విజేతగా నిలిస్తే, నేను ఓడిపోయాను అని అన్నారు. జనవరి 5న జరగనున్న స్పెషల్ సెనేట్ ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థుల తరఫున శనివారం జార్జియాలో ప్రచారం చేసిన ట్రంప్ ఈ ఎన్నికల్లో కూడా అవకతవకలు జరుగుతాయని జోస్యం చెప్పారు. నేను నిజంగా ఓడిపోయి ఉంటే ఆ పరాజయం చాలా గొప్పగా ఉండేది. అప్పుడు నేనే ఓడిపోయానని చెప్పుకొని నా ఇంటికి వెళ్లిపోయేవాడిని అని పేర్కొన్నారు. బైడెన్ విజయం సాధించిన తర్వాత డోనాల్డ్ ట్రంప్ ప్రజల మధ్యన మాట్లాడడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.