నోట్లు పంచుడులో తొలిసారి గులాబీ పార్టీ నేతలు అడ్డంగా బుక్ అవుతున్నారా?
గ్రేటర్ ఎన్నికల్లో కీలకమైన పోలింగ్ కు రంగం సిద్ధమవుతోంది. ఎన్నికల ప్రచారం ముగిసిందో లేదో.. ప్రలోభాల పర్వం ప్రారంభం కావటం ఒక ఎత్తు.. ఇప్పటివరకు ఏ ఎన్నికల్లో లేని రీతిలో.. తాజాగా అధికార పార్టీకి చెందిన వారు అదే పనిగా ప్రత్యర్థి పార్టీల వారికి అడ్డంగా దొరికిపోతున్న తీరు అంతకంతకూ పెరిగిపోతోంది. ఎన్నికల వేళలో.. గులాబీ పార్టీ వారి పోల్ మేనేజ్ మెంట్ ప్రత్యర్థులకు ఏ మాత్రం మింగుడుపడని రీతిలో ఉంటుందని చెప్పాలి.
అందుకు భిన్నంగా ఈసారి బీజేపీ నేతల దూకుడుకు గులాబీ నేతలు పరేషాన్ అవుతున్న పరిస్థితి. గ్రేటర్ పరిధిలోని పలు డివిజన్లలో గులాబీ పార్టీకి చెందిన వారు డబ్బులు పంచుతూ అడ్డంగా దొరికిపోతున్నారు. గురి పెట్టిన బాణం దూసుకెళ్లిన రీతిలో బీజేపీ కార్యకర్తలు.. టీఆర్ఎస్ కార్యకర్తల్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టేసుకుంటున్నారు.
తాము పట్టుకున్న వారికి సంబంధించిన వీడియోలు తీసి.. మీరు ఎక్కడ నుంచి వచ్చారు? ఎవరిని ప్రలోభాలకు గురి చేయటానికి వెళుతున్నారు? ఎంత మొత్తం డబ్బులు తీసుకెళుతున్నారు? మీ వెంట ఎంతమంది ఉన్నారు? ఎక్కడ ఉన్నారు? ఏ డివిజన్ లో డబ్బులు పంచుతున్నారు? లాంటి ప్రశ్నల్ని సంధిస్తూ.. ఆ సమాధానాల్ని వీడియో తీస్తున్నారు. ఆ వెంటనే వాటిని వాట్సాప్ లలోనూ.. సోషల్ మీడియాలోనూ వైరల్ చేస్తున్నారు.
ఎప్పుడూ లేని రీతిలో ఈసారి ఎన్నికల వేళలో.. గులాబీ బ్యాచ్ అదే పనిగా పట్టుబడిపోవటం.. కమలం కార్యకర్తలకు అంత సింఫుల్ గా ఎలా దొరుకుతున్నారన్నది ఇప్పుడు ప్రశ్నగా మారటమే కాదు.. గులాబీ దళంలో కొత్త గుబులు పుట్టిస్తోంది. ఓట్ల కోసం ఇంత భారీగా నోట్లను పంచుతారా? అన్న విమర్శలు ఆ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.