టీఆర్ఎస్ మరో ఎమ్మెల్యే కన్నుమూత.. విషాదం

Update: 2020-12-01 04:00 GMT
టీఆర్ఎస్ లో విషాదం అలుముకుంది. తెలంగాణ రాష్ట్ర సమితిలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆ పార్టీ నాయకుడు, ఎమ్మెల్యే నోముల నర్సింహ్మయ్య కన్నుమూశారు. ఆయన వయస్సు 64 సంవత్సరాలు.  కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.  హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో నోముల చికిత్స పొందుతున్నారు. మంగళవారం ఆరోగ్య పరిస్థితి విషమించి మరణించారు.

నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ఎమ్మెల్యే గా ఉన్న నోముల నర్సింహ్మయ్య మృతికి తెలంగాణ సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రజల కోసం పనిచేసిన నోముల లేని బాధ తీర్చలేనిదన్నారు. హిమాయత్ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఉంటున్న ఆయన సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత అనారోగ్యానికి గురయ్యారు. శ్వాసతీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వెంటనే అపోలో ఆస్పత్రికి తరలించగా తెల్లవారుజామున కన్నుమూశారు.

1956లో జన్మించిన నోముల ఎంపీపీగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. మొదట సీపీఎం పార్టీలో చేరి రెండు సార్లు నకిరేకల్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. సీపీఎం శాసనసభాపక్ష నేతగా కొనసాగారు.  ఆ తరువాత 2018లో టీఆర్ఎస్ లోచేరి నాగార్జున సాగర్ నుంచి బరిలో దిగారు. అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డిపై గెలుపొందారు.
Tags:    

Similar News