స్థానిక ఎన్నికల్లో దూసుకెళ్లిన కారు!
లోక్ సభ ఎన్నికల్లో ఊహించని షాక్ తగిలిన గులాబీ పార్టీకి తాజాగా విడుదలైన పరిషత్ ఎన్నికల ఫలితాలు ఊరట ఇవ్వటమే కాదు.. ఈ మధ్యన మిస్ అయిన కాన్ఫిడెన్స్ లెవల్స్ ను మళ్లీ పెంచేలా ఉన్నాయి. తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ టీఆర్ ఎస్ తిరుగులేని అధిక్యతను ప్రదర్శించింది.
ఆ మధ్య జరిగిన అసెంబ్లీ.. ఈ మధ్యన జరిగిన పంచాయితీ ఎన్నికల్లో విడుదలైన ఫలితాలకు తగ్గట్లే తాజా పరిషత్ ఎన్నికల్లో తిరుగులేని అధిక్యతను ప్రదర్శించింది. గత నెల ఏడెనిమిది తేదీల్లో జరిగిన పరోక్ష ఎన్నికల్లో 32 జెడ్పీ పీఠాలు.. 382 ఎంపీపీలు టీఆర్ ఎస్ వశమయ్యాయి. ప్రతి జిల్లాలోనూ టీఆర్ ఎస్.. కాంగ్రెస్ ల మధ్య వ్యత్యాసం కొట్టొచ్చినట్లుగా కనిపించింది. ఏ జిల్లాలోనూ డబుల్ డిజిట్ దాటని దుస్థిలో కాంగ్రెస్ నెలకొంది.
లోక్ సభ ఎన్నికల్లో నాలుగు ఎంపీ స్థానాల్లో విజయం సాధించి అందరి దృష్టిని ఆకర్షించిన బీజేపీ.. తాజా పరిషత్ ఎన్నికల్లో అలాంటి మేజిక్ ను రిపీట్ చేయలేకపోయింది. ఎంపీటీసీలు.. జెడ్పీటీసీల్లో గులాబీ కారు స్పీడ్ ను విపక్షాలు అందుకోలేని పరిస్థితి ఉంది. మొత్తం 5817 ఎంపీటీసీ స్థానాలకు ఇప్పటివరకూ 5738 స్థానాలకు ఫలితాలు వెల్లడయ్యాయి. అందులో టీఆర్ ఎస్ కు 3556 స్థానాలు సొంతం చేసుకోగా.. కాంగ్రెస్ 1377 స్థానాల్లో విజయం సాధించింది. ఇక.. బీజేపీ కేవలం 211 స్థానాల్లో మాత్రం గెలిచింది. వామపక్షాలు 84స్థానాల్లో గెలవగా.. టీడీపీ 21 స్థానాల్లో విజయం సాధించింది. ఆసక్తికరమైన అంశం ఏమంటే.. కాంగ్రెస్ మినహా మిగిలిన విపక్ష పార్టీలకువచ్చిన స్థానాల కంటే స్వతంత్రులు సొంతం చేసుకున్న స్థానాలే ఎక్కువ కావటం విశేషం. ఇతరులు 489 స్థానాల్లో విజయం సాధించారు.
ఇదిలా ఉంటే.. జెడ్పీటీసీ ఫలితాలు టీఆర్ ఎస్ హవా స్పష్టంగా కనిపించింది. మొత్తం 538 స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. 535 స్థానాలకు ఫలితాలు వెల్లడయ్యాయి. ఇందులో టీఆర్ ఎస్ 446 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ 76 స్థానాల్లో విజయం సాధించగా.. బీజేపీ 8 స్థానాల్లో గెలిచింది. ఇతరులు ఐదు స్థానాల్లో గెలిచారు. ఈ గణాంకాలు చూస్తే.. టీఆర్ ఎస్ కు కాంగ్రెస్ కు మధ్య వ్యత్యాసం అందనంత ఎక్కువగా ఉందని చెప్పక తప్పదు.