స‌ర్కారుతో అమీ తుమీ.. ఉద్యోగ సంఘాల నేత‌ల నిర్ణ‌యం.. రీజ‌న్ ఇదేనా?

Update: 2022-12-19 15:30 GMT
ఏపీలో ఉద్యోగుల‌కు వైసీపీ ప్ర‌భుత్వం రిక్త‌హ‌స్తాలు చూపిస్తున్న విష‌యం తెలిసిందే. త‌మ డిమాండ్ల విష యంలో ప్ర‌భుత్వం సాచివేత ధోర‌ణిని ప్ర‌దర్శిస్తోంది. కీల‌క‌మైన డిమాండ్ల‌ను కూడా ప్ర‌భుత్వం ప‌రిష్క‌రిం చ‌డం లేదు. దీంతో ఉద్యోగులు తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్నారు. కానీ, వారు నేరుగా ఏమీ చేయ‌లేరు. ఏం చేయాల‌న్నా.. ఉద్యోగ సంఘాల నాయ‌కుల ద్వారానే జ‌ర‌గాలి. సో.. వారంతా సంఘాల నేత‌ల‌పై ఆధార‌ప‌డ్డారు.

అయితే.. సంఘాల నాయ‌కులు.. కొన్నాళ్లు ఆయా స‌మ‌స్య‌ల‌పై పోరాడినా.. త‌ర్వాత ఎందుకో మెత్త‌బ‌డ్డారు. ఒక‌ప్పుడు హాట్ హూట్‌.. అంటూ రెచ్చిపోయిన కేఆర్ సూర్య‌నారాయ‌ణ‌మూర్తి, బొప్ప‌రాజు వెంక‌టేశ్వ‌ర్లు, బండి శ్రీనివాస‌రావు వంటి వారు కూడా త‌ర్వాత కాలంలో సైలెంట్ అయ్యారు. పోనీ.. ఆయా స‌మ‌స్య‌లు ఏమైనా ప‌రిష్కారం అయ్యాయా? అంటే లేదు. కానీ, నేత‌లు మాత్ర‌మౌనం పాటించారు. దీంతో ఉద్యోగులు డోలాయ‌మానంలో ప‌డ్డారు.

ఏం చేయాలా? అని చింతిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే వారికి అందివ‌చ్చిన అవ‌కాశంగా.. ఉద్యోగ సంఘాల ఎన్నిక‌ల‌కు రంగం రెడీ అవుతోంది. ప్ర‌ధాన ఉద్యోగ సంఘాలైన ఏపీ జేఏసీ అమ‌రావ‌తి, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వ ఉద్యోగుల సంఘం, ఆంధ్ర ప్ర‌దేశ్ రెవెన్యూ ఉద్యోగుల సంఘం, పంచాయ‌తీ సంఘం, ఉపాధ్యాయ సంఘం ఇలా.. సంఘాల‌కు వ‌చ్చే ఏడాది మార్చి నుంచి అక్టోబ‌రు మ‌ధ్య ప‌ద‌వి కాలం పూర్త‌వుతుంది.

దీంతో కొత్త‌గా నేత‌ల‌నుఎన్నుకోవాల్సిన బాధ్య‌త ఉద్యోగుల‌పై ప‌డింది. ఈ క్ర‌మంలోనే ఉద్యోగులు. ఇప్పుడు వీరికి చెక్ పెట్టేందుకు రెడీ అవుతున్న‌ట్టు తెలుస్తోంది. అంటే.. త‌మ ప్ర‌యోజ‌నాల‌ను ప‌క్క‌న పెట్టి.. ప్ర‌భుత్వంతో లాలూచీ ప‌డ్డార‌ని అనుమానిస్తున్న సంఘాల నేత‌ల‌కు ఎన్నిక‌ల్లో చుక్కెదుర‌య్యే ప‌రిస్థితి ఉంటుంద‌ని స‌మాచారం. దీంతో ఈ విష‌యాన్ని, ఉద్యోగుల ఆగ్ర‌హాన్ని ప‌సిగ‌ట్టిన సంఘాల నేత‌లు.. అనూహ్యంగా ముందుకు క‌దిలారు.

ఆదివారం ఒక్క‌సారిగా ఉద్యోగ సంఘాల నాయ‌కులు వివిధ ప్రాంతాల్లో జ‌రిగిన‌న కార్య‌క్ర‌మాల్లో పాల్గొని తీవ్ర నిర‌స‌న స్వ‌రం వినిపించారు. సంక్రాంతి త‌ర్వాత‌.. ఉద్య‌మ‌బాట ప‌ట్టాల‌ని.. బొప్ప‌రాజు పిలుపునిస్తే.. అస‌లు రాష్ట్రంలో ఆర్థిక మంత్రి ఉన్నాడా లేడా? అని కేఆర్ సూర్య‌నారాయ‌ణ వ్యాఖ్యానించారు.

దీంతో ఇటీవ‌ల కాలంలో ఇలాంటి ప‌రిణామం చూడ‌ని వారు ఇదేంట‌ని ఆశ్చ‌ర్య‌పోయారు.అయితే.. ఇదంతా త‌మ‌ను తాము కాపాడుకునేందుకైనా.. ఉద్య‌మించ‌క త‌ప్ప‌నిప‌రిస్థితి ఏర్ప‌డింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. 




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News