రేవంత్ రెడ్డికి ఆయుధం దొరికిందా?
రేవంత్‌రెడ్డి. తెలంగాణ రాజకీయాల్లో ఆయనో ఫైర్ బ్రాండ్. యువ నాయకుడిగా మంచి గుర్తింపు ఉన్న నేత. గతంలో టీడీపీలో ఉన్నప్పుడు.. ఇప్పుడు కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు కూడా ఆయన హవా సేమ్ టు సేమ్. పార్టీలు మారినా.. ప్రబావం ఏమాత్రంతగ్గని నాయకుడిగా రేవంత్ పేరు తెచ్చుకున్నారు. అలాంటి నాయకుడిపై తెలంగాణ కాంగ్రెస్ నాయకులు, సానుభూతి పరులు చాలానే ఆశలు పెట్టుకున్నారని అనిపిస్తోంది. తాజాగా గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ మట్టి కరిచింది. దీనికి బాధ్యత వహిస్తూ.. కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేశారు. త్వరలోనే ఇక్కడ పార్టీ చీఫ్‌ను ఎంపిక చేయనున్నారు.
ఈ క్రమంలో కాంగ్రెస్ వాదులు రేవంత్ రెడ్డి వైపే మొగ్గు చూపుతున్నారు. ఆయన దూకుడు, భాష, సవాళ్లు విసిరే రాజకీయం.. వంటివి పార్టీని పుంజుకునేలా చేస్తాయని చెబుతున్నారు. అంతేకాదు.. ఇప్పటి వరకు టీఆర్ ఎస్ నేత, మంత్రి కేటీఆర్‌కు చెక్ పెట్టే నాయకుడుగా కాంగ్రెస్ ఎవరూ లేరు. ఇక, బీజేపీలో నిన్న మొన్నటి వరకు ఉన్న లక్ష్మణ్ మారి.. ఫైర్ బ్రాండ్ నాయకుడు బండిసంజయ్ పగ్గాలు చేపట్టారు. ఇప్పుడు ఈ ఇద్దరిని తట్టుకుని కాంగ్రెస్ ఎదగాలంటే.. అంతే సత్తా.. ఉన్న యువ నాయకుడు రేవంత్ కాంగ్రెస్ చీఫ్‌గా రావడమే మంచిదని అంటున్నారు. ఈయన కనుక కాంగ్రెస్ పగ్గాలు చేపడితే.. నిత్యం ఈ ముగ్గురు నేతల మధ్య చోటు చేసుకునే సవాళ్ల రాజకీయం అదిరిపోతుందని చెబుతున్నారు.
యువత కూడా కాంగ్రెస్ వైపు ఎట్రాక్ట్ అవుతారని పరిశీలకులు అంటున్నారు. అదేసమయంలో కాంగ్రెస్ ప్లేస్‌ను తాము ఆక్రమిస్తామని చెబుతున్న బీజేపీ నేతలకు కంటిపై కునుకు లేకుండా చేయడంలోనూ రేవంత్ అయితేనే బెటర్ అని అంటున్నారు. ఇటీవల గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ నేతలు.. తాము గెలిస్తే.. వరద బాధిత కుటుంబాలకు రూ.25 వేలు ఇస్తామని హామీలు గుప్పించారు. అయితే.. ఇప్పుడు గ్రేటర్ మేయర్ పీఠం దక్కలేదు కనుక ఈ హామీ నుంచి తప్పుకొనే అవకాశం ఉంది. అదే.. రేవంత్ అయితే.. ఈ ఒక్క హామీని పట్టుకుని బీజేపీ నేతలకు చుక్కలు చూపించడం ఖాయమని అంటున్నారు పరిశీలకులు.
``మీరు మేయర్ పీఠం ఎక్కకపోతే.. ఏమైంది. కేంద్రంలో మీపార్టీనే అధికారంలో ఉంది కదా.. అక్కడ నుం చి ఎత్తుకొచ్చి.. ఇక్కడ ఇవ్వండి`` అని రేవంత్ నిలదీయడం ఖాయమని చెబుతున్నారు పరిశీలకులు. రాజకీయంగా ఇది బీజేపీని నిలువునా ఇరుకున పెడుతుందని కూడా అంటున్నారు. ఒకవేళ.. మీరు(కాంగ్రెస్) కూడా రూ.50 వేలు ఇస్తామన్నారుగా అని బీజేపీ ఎదురు దాడి చేసినా.. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో లేదని చెప్పేందుకు రేవంత్‌కు అవకాశం ఉండడంతోపాటు.. హామీని అడ్డు పెట్టి బీజేపీని ప్రజల ముందు నిలబెట్టేందుకు గట్టి అవకాశం చిక్కుతుందని చెబుతున్నారు. ఇప్పుడున్న తెలంగాణ దూకుడు రాజకీయాల్లో అంతే దూకుడుగా.. ఎవరినైనా టార్గెట్ చేయగల నాయకుడిగా రేవంత్ అయితేనే బెటర్ అనేది కాంగ్రెస్ మేధావుల ఆలోచన. ఇప్పుడున్న పరిస్థితిలో కాంగ్రెస్ కు కూడా.. రేవంత్ వంటి ఫైర్ బ్రాండ్ నాయకుడే కావాల్సిన అవసరం ఉందని అధిష్టానం కూడా ఆలోచిస్తున్నట్టు సమాచారం. మరి ఏం జరుగుతుందో చూడాలి.