ఈ తిండితింటే మీకు నిత్య యవ్వనమేనట.!
నిత్య యవ్వనంగా కనిపించాలని ప్రతీఒక్కరూ కోరుకుంటుంటారు. అయితే కొందరిలో త్వరగా వృద్ధాప్య ఛాయలు వచ్చేస్తుంటాయి. మరికొందరు వయస్సు మీదపడినా యవ్వనంగా కన్పిస్తుంటారు. ఎందుకిలా జరుగుతుందని అడిగితే వంశ పారపర్యంగా వచ్చే జీన్స్ వల్ల అని చేతులు దులుపుకుంటారు. అయితే మనం రోజువారీ ఆహారంలో కొన్ని మార్పులు చేసినట్లయితే వయస్సు మీద పడితే వచ్చే ముడతలు, వృద్ధాప్యాన్ని అందనంత దూరం లో ఉంచవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. ముఖ్యంగా పాలకూర, బాదంపప్పు, బొప్పాయి, ఎరుపు క్యాప్సీకం, టమాటలను ఆహారంలో తీసుకోవాలని సూచిస్తున్నారు.
పాలకూర: పాలకూరలోని యాంటి ఆక్సిడెంట్లు, సి విటమిన్ చర్మం మృదువుగా ఉండేలా చేస్తుంది. చర్మం ముడతలు, వృద్ధాప్య ఛాయలను తొలగించే గుణంలో పాలకూరలో ఉంటుంది. నిత్యం పాలకూరను ఆహారంలో తీసుకోవడం వల్ల చర్మం ఎల్లప్పుడు తాజాగా ఉంటుంది.
బాదంపప్పు: బాదం పప్పు చర్మం ముడతలు పడకుండా చేస్తుంది. ఇందులోని ఇ విటమిన్ చర్మానికి మేలు చేస్తుంది. బాదం పప్పు తినడం, నూనె వాడటం వల్ల చర్మం మృదువుగా మారుతుంది.
టమాటలు: టమాటలో లైకోపిన్ ఉంటుంది. ఇది చర్మం ముడతలు పడకుండా కాపాడుతుంది. వృద్ధాప్య చాయలు రాకుండా చూస్తుంది. నిత్యం ఆహారంలో టమాటలు తీసుకోవడం వల్ల చర్మం కాంతివంతంగా మృదువుగా తయారవుతుంది.
ఎరుపు క్యాప్సికం: క్యాప్సికంలోని సి విటమిన్ చర్మాన్ని రక్షిస్తుంది. క్యాప్సికం నిత్యం తీసుకోవడం వల్ల చర్మం ముడతలు పడకుండా ఉంటుంది. దీనివల్ల యవ్వనంగా కన్పిస్తారు.
బొప్పాయి: బొప్పాయి పండును చర్మానికి మాస్క్ వేసుకుంటే చర్మం తాజాగా ఉంటుంది. దీనిలోని పొటాషియం, ఏ విటమన్ చర్మం మృదువుగా ఉండేలా చేస్తుంది. బొప్పాయిని ఏదోరకంగా నిత్యం ఆహారంలో తీసుకుంటే చర్మం తేమగా ఉండటంతోపాటు మృదువుగా మారుతుంది.