థామస్‌కప్‌ విజేత భారత్.. బ్యాడ్మింటన్ లో మరోసారి భళీ

Update: 2022-05-15 10:54 GMT
మన దేశంలో ప్రస్తుతం క్రికెట్ తర్వాత ప్రజాదరణ ఉన్న క్రీడ బ్యాడ్మింటన్. సైనా, సింధు వంటి అమ్మాయిలు పతకాలు తేవడం, అంతర్జాతీయ వేదికలపై అదరగొట్టడం, పురుషుల్లో కశ్యప్, శ్రీకాంత్ వంటివారు రాణిస్తుండడంతో బ్యాడ్మింటన్ బూమ్ పెరిగింది. దీనికితగ్గట్లే ఒలింపిక్స్ లోనూ సింధు వరుసగా రెండో సారి పతకం సాధించింది.

ఇతర అంతర్జాతీయ టోర్నీల్లో శ్రీకాంత్ సత్తా చాటుతున్నాడు. కాగా, ఆదివారం భారత జట్టు చిరస్మరణీయ ప్రదర్శనతో ప్రఖ్యాత థామస్‌కప్‌ విజేతగా నిలిచింది. ఫైనల్‌లో బలమైన ఇండోనేసియా జట్టును ఓడించి బ్యాడ్మింటన్‌లో సువర్ణాధ్యాయాన్ని లిఖించింది. 14సార్లు ఛాంపియన్‌గా నిలిచిన ఇండోనేషియాపై చారిత్రక విజయాన్ని భారత్‌ నమోదు చేసింది. అద్భుత ఆటతీరులో భారత ఆటగాళ్లు తుదిపోరులో ఇండోనేషియాను ఉక్కిరిబిక్కిరి చేశారు. ప్రత్యర్థి జట్టుపై 3-0 తేడాతో విజయ కేతనాన్ని ఎగరవేశారు.
Tags:    

Similar News