అయోధ్యలో భూమిపూజ జరిగే చారిత్రక రోజున మోడీ షెడ్యూల్ ఇదే

Update: 2020-08-05 04:45 GMT
ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 500 ఏళ్ల వివాదానికి ఇవాళ చెక్ పడనుంది. కోట్ల మంది హిందువుల  కల అయిన అయోధ్యలోని రామాలయ నిర్మాణానికి భూమిపూజ జరిగే చారిత్రక రోజుగా ఆగస్టు 5, 2020ను చెప్పాలి. కరోనా లాంటి సంక్షోభ సమయంలో తాము అనుకున్నది అనుకున్నట్లుగా జరగటానికి వీలుగా శంకుస్థాపన కార్యక్రమాన్ని భారీగా నిర్వహించనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 12.30 గంటల నుంచి 12.45 మధ్యలో కీలకమైన భూమిపూజ కార్యక్రమాన్ని పూర్తి చేయనున్నారు. ఇవాల్టి రోజు ప్రధాని మోడీ షెడ్యూల్ ఏ విధంగా ఉండనుందన్న విషయాన్ని చూస్తే.

ఉదయం 9:30:
- దేశ రాజధాని దిల్లీ నుంచి అయోధ్యకు బయలుదేరుతారు.
ఉదయం 10:35:
- ఉత్తరప్రదేశ్ రాజధాని లఖ్నవూ విమానాశ్రయంలో దిగుతారు.
ఉదయం 10:40:
- విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లో అయోధ్యకు పయనమవుతారు.
ఉదయం 11:30:
- అయోధ్యలోని సాకేత్ కాలనీలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్లో దిగుతారు.
- అనంతరం హనుమాన్ గఢీ ఆలయానికి బయలుదేరుతారు.
11:40:
-  ఆలయానికి చేరుకుంటారు
- గుడి ప్రాంగణంలో 5-7 నిమిషాల పాటు ఉంటారు.
12:00:
- రామ జన్మభూమి ప్రాంగణానికి ప్రధాని చేరుకుంటారు.
- అప్పటికే పండితులు వేద మంత్రాలతో ప్రత్యేక పూజలు జరుగుతూ ఉంటాయి.
12:30:
- మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు భూమి పూజ మొదలవుతుంది.
- గర్భగుడిలో 40 కిలోల వెండి ఇటుకను స్థాపిస్తారు
మధ్యాహ్నం 12:40:
- రామమందిర నిర్మాణానికి శంకుస్థాపన కీలక కార్యక్రమం
మధ్యాహ్నం 12.50:
- ఆలయ ప్రాంగణం నుంచి బయలుదేరుతారు
మధ్యాహ్నం 1:10:
- స్వామి నృత్యగోపాల్ దాస్ సహా రామమందిర తీర్థక్షేత్ర ట్రస్టు సభ్యులతో భేటీ.
మధ్యాహ్నం 2:05:
- సాకెత్ కాలనీలోని హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు.
మధ్యాహ్నం2:15:
- లఖ్నవూకు తిరుగు ప్రయాణం
Tags:    

Similar News