పుతిన్ ఇంటిపై 91 డ్రోన్లతో దాడి... ట్రంప్ రియాక్షన్ ఇదే!
అవును... ఇటీవల మరో రెండు రోజుల్లో ట్రంప్ తో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ శాంతి చర్చలు జరపనున్న సమయంలో.. రష్యా భీకర దాడులు చేసిన సంగతి తెలిసిందే.;
ఇప్పటికే ఎనిమిది యుద్ధాలు ఆపానని చెప్పుకుంటున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు.. అవన్నీ ఒకెత్తు అయితే, రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని ఆపడం మరొకెత్తు అనే సంగతి తెలిసిందే. పైగా ఈ విషయాన్ని ట్రంప్ చాలా ప్రిస్టేజ్ గా తీసుకున్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలో అటు రష్యా, ఇటు ఉక్రెయిన్ మాత్రం దాడుల విషయంలో తగ్గడం లేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ సమయంలో పుతిన్ ఇంటిపై డ్రోన్ల దాడి వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
అవును... ఇటీవల మరో రెండు రోజుల్లో ట్రంప్ తో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ శాంతి చర్చలు జరపనున్న సమయంలో.. రష్యా భీకర దాడులు చేసిన సంగతి తెలిసిందే. దీన్ని జెలెన్ స్కీ తీవ్రంగా ఖండించారు. రష్యాకు కాల్పుల విరమణ ఉద్దేశ్యం లేనట్లుందని వ్యాఖ్యానించారు. ఈ సమయంలో రష్యాలోని పుతిన్ ఇంటిపైకి ఉక్రెయిన్ డ్రోన్ లను పంపిందని అంటునారు. దీంతో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. దీనిపై పుతిన్ నుంచి ఫోన్ రావడంతో ట్రంప్ ఫైర్ అయ్యారు.
ఉక్రెయిన్ డ్రోన్ల గుంపు తన నివాసాలలో ఒకదానిని లక్ష్యంగా చేసుకున్నట్లు రష్యా అధ్యక్షుడు పుతిన్ తనతో చెప్పారని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. ఫ్లోరిడాలోని తన మార్-ఎ-లాగో రిసార్ట్ లో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో సమావేశానికి ముందు విలేకరులతో మాట్లాడిన ట్రంప్.. ఫోన్ కాల్ లో రష్యా నాయకుడు ఈ అంశాన్ని లేవనెత్తారని.. తనపై దాడి జరిగిందని చెప్పారని తెలిపారు. అయితే.. ఇది మంచిది కాదని.. నాకు చాలా కోపంగా ఉందని ట్రంప్ అన్నారు.
ఈ యుద్ధాన్ని ఆపే విషయంలో తాను చాలా నిబద్ధతతో ఉన్నానని.. జెలెన్ స్కీ తో చర్చలు జరిపిన తర్వాత.. 24 గంటల్లోనే పుతిన్ తో రెండుసార్లు మాట్లాడినట్లు తెలిపారు. వివాదం ఉన్నప్పటికీ.. పుతిన్ తో తన సంభాషణ నిర్మాణాత్మకంగా ఉందని ట్రంప్ అన్నారు. ఈ సమయంలో పుతిన్ ఇంటిపై డ్రోన్ల దాడి సరైంది కాదని ట్రంప్ అభిప్రాయపడ్డారు. ఆరోపించబడిన డ్రోన్ దాడి ధృవీకరించబడితే.. కైవ్ - మాస్కో మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు.
పుతిన్ నివాసంపై 91 డ్రోన్ లతో దాడి!:
డిసెంబర్ 28 - 29 తేదీల్లో లాంగ్ రేంజ్ డ్రోన్ ల సమూహంతో మాస్కోకు పశ్చిమాన ఉన్న నోవ్ గోరోడ్ ప్రాంతంలోని పుతిన్ నివాసంపై ఉక్రెయిన్ దాడి చేయడానికి ప్రయత్నించిందని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్ రోవ్ ఆరోపించారు. ఈ దాడిలో 91 డ్రోన్ లను ప్రయోగించారని, అయితే వాటన్నింటినీ రష్యన్ వైమానిక రక్షణ దళాలు అడ్డగించాయని ఆయన తెలిపారు. అయితే.. ఉక్రెయిన్ ఆ వాదనను ఖండించింది. 'రష్యన్ ఫెడరేషన్ నుండి మరో రౌండ్ అబద్ధాలు' అని జెలెన్ స్కీ విలేకరులతో అన్నారు.