మాణిక్యాల రావు చివరి ట్వీట్ ఇదే..

Update: 2020-08-01 16:30 GMT
ఏపీ మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు (60) కొద్దిసేపటి క్రితమే కరోనాతో చనిపోవడం విషాదం నింపింది.
మాణిక్యాల రావుకు గత నెలలోనే కరోనా సోకింది. ఆయన నెలరోజులుగా విజయవాడలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం పరిస్థితి విషమించి ఈరోజు చనిపోయారు.

అసలు మాణిక్యాలరావుకు కరోనా ఎలా సోకిందంటే.. తాడేపల్లి గూడెం మాజీ మున్సిపల్ చైర్మన్, బీజేపీ నేత తాతాజీకి (భీమ శంకరరావు)కు మొదట కరోనా సోకింది. అయితే ఆయనకు కరోనా గుర్తించకముందే మాజీ మంత్రి మాణిక్యాలరావు ... తాతాజీతోపాటు కారులో ప్రయాణించారు.

తాతాజీకి కరోనా సోకినట్టు పరీక్షల్లో తేలడంతో మణిక్యాలరావు కూడా ముందు జాగ్రత్త చర్యగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేసుకున్నారు. పాజిటివ్ గా తేలడంతో చికిత్స తీసుకుంటున్నారు.

ఇక మాణిక్యాలరావు ఆరోగ్య పరిస్థితి విషమించిందని వార్తలు రాగా.. ఆయనే స్వయంగా ట్వీట్ చేసి స్పందించారు. ‘నా ఆరోగ్య పరిస్థితిపై వస్తున్న వదంతులు ఎవరు నమ్మవద్దు.కంగారు పడవద్దు,అధైర్య పడవద్దు. నేను ఆరోగ్యంగానే వున్నా. భగవంతుని ఆశీస్సులతో, మీ అందరి ఆదరాభిమానాలతో నేను పరిపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వస్తాను.’ అంటూ జూలై 25న పేర్కొన్నారు. ఆ తర్వాత మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా త్వరగా కోలుకోవాలని ట్వీట్ చేశారు.

ఇంత ధైర్యంగా ఉన్న మనిషి అదే కరోనాతో చనిపోవడం బీజేపీ కార్యకర్తల్లో విషాదం నింపింది. ఆయన అనుచులు ఇప్పటికీ దీన్ని జీర్ణించుకోవడం లేదు.




Tags:    

Similar News