రెడ్డిల్లోనూ పేదలు.. వారి పట్ల వివక్ష తగదు!!

Update: 2020-06-24 09:10 GMT
కోరిన వారికి.. కోరని వారికి అందరికీ వరాలిచ్చేస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన సొంత సామాజికవర్గమైన రెడ్డిలలోని పేదలకు ఎటువంటి లబ్ధి చేకూర్చకపోవడం.. పథకాలు దక్కకపోవడంతో వారిలో అసంతృప్తి నెలకొంది. రెడ్డిలలోని పేద మహిళలను ఆదుకోవాలనే డిమాండ్ వస్తోంది. తాజాగా దీనిపై కొందరు గళమెత్తారు.

రెడ్డి మహిళల పట్ల వివక్ష తగదని ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం మహిళా నేత వైఎస్ తేజస్విని రెడ్డి అన్నారు. తాజాగా అనంతపురంలో మాట్లాడిన ఆమె ఇతర కులాల మహిళలకు ప్రభుత్వం చేయూతనిస్తున్న మాదిరిగానే.. ఆర్థికంగా చితికిపోయిన రెడ్డి మహిళలను ఆదుకోవాలని అన్నారు.

ఈ క్రమంలో సీఎం జగన్ రెడ్డి సామాజికవర్గంలోని పేదల అభ్యున్నతికి పాటుపడాలని.. రెడ్లకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి 1000 కోట్ల నిధులు కేటాయించాలని వైఎస్ తేజస్విని రెడ్డి అన్నారు. రెడ్డి ఆడబిడ్డలకు వైఎస్ఆర్ పెళ్లి కానుక వర్తింపచేయాలని కోరారు.

నిజానికి రెడ్డిలలో కూడా ఎంతోమంది పేదలున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల్లోని పేదలు పథకాలతో ఆర్థికంగా బలోపేతం అవుతుంటే.. కేవలం అగ్రకులం కారణంగా రెడ్డిలలోని పేదలకు ఏ పథకాలు అందడం లేదు. అదే వారికి శాపమవుతోంది. రెడ్డిలలోని పేదలను కూడా ఆదుకోవాలన్న డిమాండ్ వారి నుంచి వినిపిస్తోంది. ఈ విషయంలో సీఎం కేసీఆర్ చొరవతీసుకోవాలని రెడ్డి నేతలు కోరుతున్నారు.
Tags:    

Similar News