గ్రేటర్ లో నోట్ల కట్టల ప్రవాహమేనా?
ఎన్నికలంటే అదో ప్రహసనం. నోటిఫికేషన్ జారీ కావటం.. షెడ్యూల్ వెలువడటం.. నామినేషన్ల ప్రక్రియ.. ప్రచారం.. ఇలా చెప్పుకుంటూ పోతే పోలింగ్ నాటికి చాలానే రోజులు ఉండేవి. ఇప్పుడంతా ట్వంటీ 20 కాలం. అందునా లోకల్ ఎన్నికలు కావటంతో వేగంగా ఎన్నికల ఎపిసోడ్ ను పూర్తి చేసేస్తున్నారు. దీంతో.. నేతలు మొదలు కార్యకర్తల వరకు ఉరుకులు పరుగులు తీయాల్సి వచ్చింది.
ఈ రోజు (శనివారం) సాయంత్రం 5 గంటలకు ఎన్నికల ప్రచారం పూర్తి అవుతుంది. దీంతో.. కీలక అంకం ఒకటి పూర్తై.. అసలు లెక్కలు మొదలు కానున్నాయి. ఇప్పటివరకు మాటకు మాట.. తిట్టుకు తిట్టు.. పంచ్ కు మరో పంచ్ అన్నట్లుగా సాగిన మాటల యుద్ధానికి విరామం పలికి.. నోట్ల కట్టలతో ఎత్తులు పైఎత్తుల వేసే సిత్రమైన ఆట మొదలవుతుంది. మైండ్ గేమ్ ప్లస్ మజిల్ గేమ్ కలగలిపితే.. ఓటర్లకు డబ్బుల పంపిణీగా రాజకీయ వర్గాలు అభివర్ణిస్తాయి.
నిజానికిఇప్పటివరకు జరిగిందంతా ఒక ఎత్తు అయితే..ఇవాళ రాత్రి నుంచి రేపు రాత్రి మధ్యలో ఏం జరుగుతుందో తుది ఫలితాన్ని డిసైడ్ చేస్తుందని చెప్పక తప్పదు. ఈ మధ్య కాలంలో ఎవరైనా.. ఓట్లకు నోట్లను లెక్క కట్టి విజయవంతంగా అప్పజెబుతారో వారికి విజయ అవకాశాలు ఎక్కువగా ఉండే వీలుంది. అలా అని నోట్లే మొత్తం ఎన్నికల్ని ప్రభావితం చేస్తాయనుకుంటే తప్పులో కాలేసినట్లే. ఎందుకంటే.. నోట్లు తీసుకున్నోళ్లంతా ఓట్లు వేయాలన్న రూల్ లేదు కదా?
అందుకే.. పార్టీలు సైతం తెలివిగా.. తాము పంచే నోట్లకు.. వచ్చే ఓట్ల లెక్కల్ని ఇప్పటికే లెక్క కట్టి ఉన్నట్లుగా చెబుతున్నారు. శనివారం అర్థరాత్రి దాటిన తర్వాత నుంచి కీలక స్థానాల నుంచి డబ్బుల కట్టలు చేరాల్సిన చేరికి చేరుతున్నట్లుగా చెబుతున్నారు. తొలుత అనుకున్న అంచనాలకు భిన్నంగా.. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఖర్చు భారీగా కానున్నట్లు చెబుతున్నారు.
మొదట్లో ఓటుకు వెయ్యి అనుకున్న వారు కాస్తా.. ఇప్పుడు రెండు వేలు వరకు పలుకుతున్నట్లుగా తెలుస్తోంది. ఏదైనా ప్రాంతంలో టోకుగా ఓట్లు వేస్తామని నమ్మకంగా చెప్పిన పక్షంలో.. వారికి మరింత ఎక్కువ చెల్లించేందుకు సైతం పార్టీలు సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారు. పోటీ తీవ్రంగా ఉన్న డివిజన్ లలో మరింత ఖర్చు చేసేందుకు ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులకు సంకేతాలు వచ్చేసినట్లుగా చెబుతున్నారు. మొత్తంగా చూస్తే.. ఇప్పటివరకు సాగిన మాటల యుద్దానికి పుల్ స్టాప్ పెట్టి.. నోట్ల కట్టలతో లెక్కలు తేల్చే కార్యక్రమం షురూ కానుందని చెప్పక తప్పదు.