పవన్ పర్యటనలో దొంగలు పడ్డారు..
పవన్ కళ్యాణ్ మైక్ నందుకొని ప్రసంగాలు దంచికొడుతున్నారు. వందలాది మంది అభిమానులు జనాలు పవర్ స్టార్ వచ్చాడని ఆయన కోసం పోటెత్తారు. జనసంద్రంగా మారిన రాయలసీమ పర్యటనలో దొంగలు చేతివాటం ప్రదర్శించారు.
తాజాగా జనసేనాని పవన్ కళ్యాణ్ రాయలసీమలో పర్యటించారు. పవన్ కళ్యాణ్ రేణిగుంటకు చేరుకోగానే అక్కడి అభిమానులు పోటెత్తారు. ఈ క్రమంలోనే తోపులాట జరిగింది. ఇదే అదునుగా భావించిన జేబు దొంగలు సుమారు 40 మంది పర్సులు - ఫోన్లు కొట్టేశారు.
విశేషం ఏంటంటే ఈ తోపులాటలో జనసేన ముఖ్యనేతల ఫోన్లు కూడా మాయమైనట్లు తెలిసింది. బాధితులంతా పోలీస్ స్టేషన్ కు వెళ్లి దొంగతనంపై ఫిర్యాదు చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు.
ప్రస్తుతం జనసేనాని పవన్ కళ్యాణ్ ఆరు రోజుల పర్యటనలో భాగంగా రాయలసీమలో పర్యటిస్తున్నారు. అపరిష్కృతంగా ఉన్న సమస్యలు - మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ ప్రజలతో ముఖాముఖి నిర్వహిస్తున్నారు.