ఆ ఐఏఎస్ అధికారి ఇచ్చిన పెళ్లికార్డు.. సీఎం కేసీఆర్ ను అంతలా ఆకర్షించిందట
మిగిలిన ముఖ్యమంత్రులకు కాస్త భిన్నం తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్. రాజకీయాల్ని కాసేపు పక్కన పెట్టేసి.. విడిగా ఆయన గురించే మాట్లాడాల్సి వస్తే.. ఎన్నో విషయాల మీద పట్టు.. అవగాహన మాత్రమే కాదు.. కొత్తను స్వాగతించే గుణం.. ప్రయోగాలకు ఓకే చెప్పే నైజం ఆయన సొంతం. కొత్త విషయాలు ఏమైనా సరే.. ఆసక్తిగా వినటం ఆయనకో అలవాటు.
తన వరకు వచ్చిన కొత్త విషయాల్ని ఆయన అస్సలు విడిచి పెట్టరు. తాజాగా ఒక యువ ఐఏఎస్ అధికారి ఆయన వద్దకు వచ్చిన తన పెళ్లి శుభలేఖను తాజాగా అందజేశారు. సదరు శుభలేఖ ప్రత్యేకత ఆయన్ను విపరీతంగా ఆకర్షించినట్లు చెబుతున్నారు. దీనికి కారణం లేకపోలేదు. ఇంతకీ ఆ యువ ఐఏఎస్ అధికారి ఎవరంటే శశికాంత్. తన పెళ్లి సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసి శుభలేఖను అందించారు.
రోటీన్ శుభలేఖలకు భిన్నంగా ఈ పెండ్లి కార్డును ఆయన తయారు చేయించారు. ఆహ్వానపత్రికలోనే కూరగాయ విత్తనాల్ని ఉండేలా తయారు చేయించారు. పెళ్లి తర్వాత తన శుభలేఖను పక్కకు పడేయకుండా.. దాన్ని భూమిలో నాటితే మొక్కలు వస్తాయని చెప్పారు. ఈ స్పెషల్ శుభలేఖ గురించి సీఎం కేసీఆర్ ఎంతో ఆసక్తిగా విన్నారట. దాన్ని జాగ్రత్తగా ఉంచాలని సిబ్బందికి చెప్పినట్లుగా తెలుస్తోంది.