చలి కాలం గాలిలో ఎక్కువసేపు వైరస్.. మాస్కులు వదిలేయకండి

Update: 2020-11-02 09:10 GMT
ఇటీవల కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. ప్రజల్లో కూడా మునుపటి భయం లేదు. దీంతో మాస్కులు ధరించకుండా, భౌతికదూరంగా పాటించకుండా కరోనాను లైట్​గా తీసుకుంటున్నారు. అయితే రానున్న చలికాలంలో కరోనా పంజా విసిరే ప్రమాదం ఉన్నదని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. దేశంలో కరోనా కేసుల సంఖ్య 80 లక్షలు దాటింది. చాలా మందికి కరోనా వచ్చి పోయిఉంటుందని వైద్యులు అంచనా వస్తున్నారు. డిసెంబర్‌ నాటికి కరోనా తగ్గుముఖం పడుతుందని సర్కారీ గణాంకాలు చెబుతున్నాయి. మరణాల రేటు కూడా తగ్గుతోంది. అయితే ఇప్పటికే యూరప్​ దేశాల్లో కరోనా సెకండ్​ వేవ్​ మొదలైంది. మనదేశంలో కూడా కేసులు పెరిగే ప్రమాదం ఉన్నదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

చలికాలంలో కరోనా వైరస్​ గాలిలో ఎక్కువ సేపు ఉండే అవకాశం ఉంది. దీంతో మహమ్మారి విజృంభిస్తున్నా  ప్రజల్లో మునుపటి  భయం తగ్గిపోయింది. ఉద్యోగాలు, ఉపాధి ఇతర అవసరాల కోసం పరిమితులు దాటిపోతున్నారు. మొదట్లో ఎటువంటి జాగ్రత్తలు పాటించామో.. ఇప్పుడు కూడా అలాంటి జాగ్రత్తలే పాటించాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. చలికాలం వైరస్, బ్యాక్టీరియాలు అనుకూలంగా ఉంటుంది. ఏటా ఈ సమయంలో డెంగీ, మలేరియా, స్వైన్ ఫ్లూ తదితరల సీజనల్ వ్యాధులు విపరీతంగా అటాక్ చేస్తాయి. గతంతో పోలీస్తే ఈసారి సీజనల్ వ్యాధులు కాస్త తక్కువగానే నమోదవుతున్నా.. ఈ సమయంలో కచ్చితంగా అప్రమత్తంగా ఉండాలంటున్నారు వైద్యులు. కాబట్టి ప్రజలు పండగలు, వేడుకలకు దూరంగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
Tags:    

Similar News